...

దారుణం: చేతబడి చేసిందన్న అనుమానంతో వృద్ధురాలిపై కిరోసిన్ పోసి.. ఆపై.?

ఓ వైపు టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అవుతూ ఉన్నా..చాలా ప్రాంతాల్లో మూఢనమ్మకాలను ప్రజలు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. ఇంకా దయ్యాలను,భూతాలను నమ్మేవాళ్ళు లేకపోలేదు. జార్ఖండ్లోని సిమ్ డేగా జిల్లాలో ఒక వృద్ధురాలుని సజీవదహనం చేయాలని ప్రయత్నించారు స్థానికులు. ఒక గ్రామంలో ఆమె చేతబడి చేసిందనే అనుమానంతో స్థానికులు ఆమెకు నిపంట్టించారని పోలీస్ అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement

ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు సదర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తేతైతంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుద్పని దీపతొలి లోని బంధువుల ఇంటికి ఝర్యా దేవి వెళ్లగా గ్రామస్తులు కొందరు ఆమెపై దాడి చేశారు. తమ ఆరోగ్యం దెబ్బతినేలా చేతబడి చేసిందని ఆరోపిస్తూ, స్థానికులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

Advertisement

ఈ ఘటనపై కొందరు పోలీసులకు సమాచారం అందించారు,పోలీసులు అక్కడికి చేరుకొని ఝర్యా దేవిని రక్షించి సదర్ ఆస్పత్రికి తరలించారు.గతవారం కొలెబిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెస్రజారా బజార్ సమీపంలోని 32 ఏళ్ల వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపి,అతని శరీరానికి నిప్పంటించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడైన గ్రామ పెద్ద సుబున్ బడ్ ను ఎట్టకేలకు పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరింది.

Advertisement
Advertisement