...

Gas Trouble Relief : మీకు గ్యాస్ ట్రబుల్ ఉందా.? టాబ్లెట్ కంటే స్పీడ్‌గా గ్యాస్ ట్రబుల్‌ని తగ్గించే డ్రింక్.. ఏంటో తెలుసా..?

Gas Trouble Relief : ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. చలికాలంలో సహజంగానే మనకు తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు కలుగుతాయి. కొందరికి ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. ఇక కొందరికైతే అసలే జీర్ణం కాదు. దాంతో జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

Advertisement

అలాంటివారు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లోనే దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో అజీర్ణం సమస్యకు చెక్ పెట్టవచ్చు.వాటిని తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది.ఇతర జీర్ణ సమస్యలు కూడా పోతాయి.అది ఏమిటంటే.. మనం ప్రతి రోజూ ఏదో ఒక రకంగా వాడే వాము. వాము లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పావు టీ స్పూన్ వాము లో చిటికెడు ఉప్పు వేసి నములుతూ రసాన్ని మింగవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపి తినవచ్చు.లేకపోతే వాము గింజలను నీటిలో వేసి మరిగించాలి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి.

Advertisement

ఈ నీటిని ఉదయాన్నే తీసుకుంటే చాలా మంచిది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి, ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ నీటిని తాగడం వలన జీర్ణ సంబంధ సమస్యలు తగ్గటమే కాకుండా డయాబెటిస్ ఉన్న వారు, అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు, రక్తపోటు సమస్య తో బాధపడుతున్న వారికి కూడా చాలా సహాయపడుతుంది. ఈ డ్రింక్ ను తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను మీరు పొందవచ్చు.

Advertisement

Read Also : Whatsapp New Features : త్వరలోనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సాప్… ఇక ఆ దిగులు ఉండదు !

Advertisement
Advertisement