గుడ్ న్యూస్ : ఈ రాశుల వారికి ఈ రోజు గర్ల్ ఫ్రెండ్ తో షికారు చేసే ఛాన్స్..

ఈరోజు కొన్ని రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసొచ్చే అవకాశం ఉంది. ఏ రాశి వారికో తెలుసుకుందాం.. ముందుగా మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. దూర ప్రాంతం నుండి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృషభ రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు అందివస్తాయి. కోర్టు కేసుల్లో నెగ్గుతారు. ఆరోగ్యం పర్వాలేదు. మిధున రాశి వారికి అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితురాలిపై బాగా ఖర్చు చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. కర్కాటకం రాశి వారికి స్థానచలనం జరగవచ్చు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం వస్తుంది. రుణ సమస్యల నుంచి బయటపడతారు.

సింహ రాశి వారికి మంచి కంపెనీ నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్స్ రావచ్చు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. కన్య రాశి వారికి ఉద్యోగంలో మార్పు చోటు చేసుకోవచ్చు. బంధువులతో చికాకులు తలెత్తుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. తులా రాశి వారికి ఉద్యోగంలో అనుకూల సమాచారం అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కొద్దిగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వృచ్చిక రాశి వారికి ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి ఆర్థిక పరిస్థితి కోసం ప్రయత్నాలు చేస్తారు.

Advertisement

ధనుస్సు రాశి వారికి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పరిచయస్తులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. మకర రాశి వారికి ఆదాయం నిలకడగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. కుంభ రాశి వారికి ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. గర్ల్ ఫ్రెండ్ తో చక్కగా షికార్లు చేస్తారు. మీన రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్ వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel