సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేశ్ బాబు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణ కన్నీరు మున్నీరుగా విలపించాడు. గతంలో భార్యను దూరం కావడం, ఇప్పుడు కొడుకు సైతం దూరం కావడంతో ఆయన కుంగిపోతున్నారు. ఇలా ఇండస్ట్రీలో కొడుకును కోల్పోయిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీలో చాలా మంది తమ వారసులను వివిధ ప్రమాదాల్లో కోల్పోయారు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అంతకు ముందు హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రామ్ సైతం రోడ్డు ప్రమాదంలోనే కన్నుమూశారు. రచయిత పరుచూరి వెంకటేశ్వర్ రావు కొడుకు రఘుబాబు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ చనిపోయాడు. దీంతో వారు ప్రతి సంవత్సరం ఆయన పేరుపై ఉత్సవాలు జరిపిస్తున్నారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కొడుకు సైతం చనిపోయాడు. బాబుమోహన్ సైతం రోడ్డు ప్రమాదంలో తన కొడుకు వపన్ కుమార్‌ను కోల్పోయాడు.
దివంగత యాక్టర్ మారుతిరావుకు సైతం ఈ పరిస్థితి వచ్చింది. అతడి కొడుకు శ్రీనివాస్ చిన్న వయసులోనే ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. ప్రముఖ డైరెక్టర్ తేజ కొడుకు ఆరేండ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ బాధ నుంచి తేజ తొందరగా బయటపడలేదు. అందుకే ఎన్నో ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు ఆయన. ఇక ప్రకాశ్ రాజ్ కొడుకు సైతం చిన్న వయసులోనే చనిపోయాడు. దీంతో ఆయన చాలా కుంగిపోయాడు. ఇక ప్రముఖ డైరెక్టర్, యాక్టర్, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా కొడుకు సైతం చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా తమకు బాసటగా నిలిచే కొడుకులను దూరం చేస్తుకున్న తండ్రులు ఆ బాధ నుంచి ఇంకా బయటపడలేకపోతున్నారు.