WhatsApp : వాట్సాప్ నయా ఫీచర్.. ఇక నోటిఫికేషన్ బార్‌లో పేరుతో పాటు ఫొటో..

Updated on: January 8, 2022

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజ్ చేయని స్మార్ట్ ఫోన్ యూజర్ ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కంపల్సరీగా వాట్సాప్ ను యూజ్ చేస్తుంటారు. తమ నిత్య జీవితంలో వాట్సాప్ అనేది ఓ భాగమైందని చెప్పొచ్చు. అంతలా పాపులర్ అయిన వాట్సాప్ తన కస్టమర్స్ కోసం సరికొత్త ఫీచర్స్ ను తీసుకొస్తూనే ఉంది. తాజాగా ఎవరూ ఊహించని నయా ఫీచర్ తీసుకురాబోతున్నట్లు వాట్సాప్ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ కు బోలెడు మంది యూజర్స్ ఉన్నారు. ఎక్కువ డౌన్ లోడ్స్ తో దూసుకుపోతున్న వాట్సాప్ ఇప్పటికే రెండు బిలియన్ మంది యూజర్స్‌ను కలిగి ఉంది. కాగా, మరింత మంది యూజర్స్‌ను అట్రాక్ట్ చేసే క్రమంలో వాట్సాప్ మరి కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. ఇందుకుగాను కృషి చేస్తోంది.

వాట్సాప్ అందించే సదరు నయా ఫీచర్ ద్వారా ఇతరుల నుంచి ఏదేని మెసేజ్ రాగానే నోటిఫికేషన్ బార్‌లో పేరుతో పాటు ప్రొఫైల్ ఫొటో కూడా డిస్ ప్లే అవుతుంది. పూర్వం పేరు మాత్రమే కనబడేది. కాగా, ఇకపై నోటిఫికేషన్ బార్‌లో మెసేజ్ పంపిన వ్యక్తి పేరుతో పాటు ప్రొఫైల్ ఫొటో కనబడుతుంది. అలా యూజర్స్‌కు సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.

Advertisement
whatsapp12
whatsapp12

ఇలా ప్రొఫైల్ ఫొటో కనబడటం ద్వారా యూజర్స్‌కు ఎవరు మెసేజ్ పంపారు అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. అలా వాట్సాప్ కస్టమర్స్‌కు ఈ నయా ఫీచర్ వలన మంచి యూజ్ ఉంటుంది. అయితే, వాట్సాప్‌ ఈ ఫీచర్‌ను తొలుత ఐఓఎస్‌ యూజర్స్‌కు అవెయిలబులిటీలోకి తీసుకురానుంది. ఆ తర్వాత ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు ఇంట్రడ్యూస్ చేయనుంది. ప్రజెంట్ ఈ ఫీచర్ టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel