TVS Raider 125 Drum Review : మిడిల్ క్లాసు బైక్ అదుర్స్.. మీ బడ్జెట్ ధరలో స్పోర్ట్స్ బైక్.. ధర జస్ట్ ఎంతంటే?

TVS Raider 125 Drum Review : మీ బడ్జెట్ ధరలో కొత్త బైక్ అద్భుతంగా ఉంది. టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ బైక్ ఫీచర్లు కిర్రాక్ ఉన్నాయి. బడ్జెట్ రైడర్లు తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.

  • ఈ స్పోర్టీ బైక్ సరసమైన ధరలో కొనేసుకోవచ్చు
  • మిడిల్ క్లాసు కుర్రాళ్ల కోసం స్పోర్టీ బైక్
  • జస్ట్ 5.9 సెకన్లలోనే 0 నుంచి 60కి.మీ స్పీడ్ రేంజ్
  • టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ బైక్ ఫీచర్లు, స్పెషిఫికేషన్లు

TVS Raider 125 Drum Review : కొత్త బైక్ కొనేవారికి అదిరిపోయే న్యూస్. యూత్ తప్పనిసరిగా కొనాల్సిన బైక్ ఇది. ఈ టీవీఎస్ రైడర్ 125 బైక్ మోడల్ 125CC సెగ్మెంట్‌లో స్పోర్టీ లుక్‌తో వస్తుంది. మీరు తక్కువ బడ్జెట్ ధరలో టీవీఎస్ డ్రమ్ వేరియంట్‎ అందిస్తోంది. ఈ బైక్ లైనప్‌లో చౌకైన మోడల్. తక్కువ ధరలో అద్భుతమైన డిజైన్ అందిస్తోంది. ఈ బేస్ మోడల్ ధర, ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ వివరాలపై ఓసారి లుక్కేయండి.

మిడిల్ క్లాసు కుర్రాళ్ల కోసం స్పోర్టీ బైక్ :

ఈ టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ వేరియంట్ (ఎక్స్-షోరూమ్) ధర దాదాపు రూ.82వేలు ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ TFT వెర్షన్ ధర రూ.97వేలు ఉంటుంది. బేస్ మోడల్‌, టాప్ మోడల్‌ మధ్య దాదాపు రూ.15వేలు తేడా ఉంది. మిడిల్ క్లాసు కుర్రాళ్లు ఈఎంఐలో స్పోర్టీ బైక్ కొనేసుకోవచ్చు. ధర తక్కువ మైలేజీ ఎక్కువ అందించే ఈ బైకు కొనేందుకు అసలు వెనక్కి తగ్గొద్దు.

DRLs ప్రీమియం లుక్‌ అదుర్స్ :
బేస్ వేరియంట్ అయినా లుక్ విషయంలో వెనక్కి తగ్గేది ఉండదు. ఖరీదైన మోడళ్లలో ఉండే షార్ప్, అగ్రెసివ్ డిజైన్ ఇందులో ఉంది. సిగ్నేచర్ స్టైల్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, స్టైలిష్ DRLs ప్రీమియం లుక్‌ అందిస్తాయి. ట్యాంక్ వద్ద స్పోర్టీ ఎక్స్‌టెన్షన్లు, ఇంజిన్ కౌల్ స్పోర్ట్స్ బైక్‌ మాదిరిగా ఉంటాయి. ఈ డ్రమ్ వేరియంట్‌ స్ట్రైకింగ్ రెడ్, వికెడ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విక్రయిస్తోంది.

Advertisement

Read Also : Rythu Bharosa 2026 : రైతు భరోసా డబ్బులు పడేది ఈరోజే? ఒకే విడతలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు?

TVS Raider 125 Drum Review : ఎల్‌సీడీ డిజిటల్ కన్సోల్ ఆప్షన్లు :

మీ బడ్జెట్ ధరలో టీవీఎస్ అన్ని డిజిటల్ ఫీచర్లతో వస్తుంది. రివర్స్ LCD డిజిటల్ కన్సోల్ కూడా ఉంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ ట్యాంక్‌లోని పెట్రోల్‌కు యావరేజ్ మైలేజ్ వివరాల్లో డిస్‌ప్లేలో కనిపిస్తాయి. ఈ బైకు ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ టెక్నాలజీతో వస్తుంది. స్మార్ట్ కనెక్టివిటీ, బ్లూటూత్ హై-టెక్ ఫీచర్లు లేవు. యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది.

లీటర్ కొడితే 65కి.మీ రేంజ్ :
ఇందులో 124.8cc ఎయిర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ ఉంది. 11.38PS పవర్, 11.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ ద్వారా సిటీ ట్రాఫిక్‌లో కూడా చాలా స్మూత్‌గా పోతుంది. జస్ట్ 5.9 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. లీటరుకు సుమారు 60 నుంచి 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని అంచనా.

Advertisement

బ్రేక్ వేసినా బైక్ స్కిడ్ కాదు :
డ్రమ్ వేరియంట్ బైకులో 2 వైపులా 130mm డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ (CBS) కూడా ఉంది. బ్రేక్ వేసినా బైక్ స్కిడ్ రిస్క్ ఉండదు. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉంటే బ్యాక్ సైడ్ 5-స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ ఛార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. గుంతల రోడ్లపై ప్రయాణం సేఫ్‌గా ఉంటుంది. 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో లాంగ్ రైడ్లకు బెస్ట్ బైక్..

Tufan9 Telugu Desk

Tufan9 Telugu Desk

Leading the Tufan9 editorial team, Tufan9 Telugu Desk uncovers stories that matter to you. From trending news to in-depth analysis, every report is crafted with care. Stay ahead of the headlines and discover news the way it’s meant to be read.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel