AP Budget 2026 : ఏపీ బడ్జెట్ 2026: మహిళలకు నెలకు రూ.1500? ‘ఆడబిడ్డ నిధి’పై ఇవాళే క్లారిటీ!

AP Budget 2026 : ఈసారి బడ్జెట్‌లో ఏపీ ప్రజలపై వరాల జల్లు కురిపించనుంది కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 అందించే అవకాశం ఉంది. చంద్రబాబు సర్కార్ సంచలన ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు కనిపిస్తోంది.

  • ఏపీ మహిళలకు కూటమి ప్రభుత్వం వరాల జల్లు?
  • ఫిబ్రవరి 14న ఏపీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న చంద్రబాబు సర్కార్
  • ఈ బడ్జెట్ లో ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై కీలక ప్రకటన వచ్చే ఛాన్స్
  • ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం 

AP Budget 2026 : ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు వరాల జల్లు కురిపించనుంది. ఈరోజు (ఫిబ్రవరి 14, 2026) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టనుంది.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శనివారం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు రాష్ట్ర బడ్జెట్‌ను (AP Budget 2026) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్‌పై ఉత్కంఠ నెలకొంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం.

AP Budget 2026 : ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఆర్థిక సాయం :

ప్రత్యేకించి మహిళా సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం భారీ కేటాయింపులను అందించనుంది. ‘ఆడబిడ్డ నిధి’ పథకంపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ పథకంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 అందించనుంది.

Advertisement

Read Also : PM Kisan 22nd Installment : రైతులకు అలర్ట్ : ఫిబ్రవరిలో పీఎం కిసాన్ 22వ విడత రూ. 2,000 ఖాతాలో ఎప్పుడొస్తుంది?

ఈ పథకం అమలుకు సంబంధించి అవసరమైన భారీ నిధులను కూడా కూటమి ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ‘దీపం 2.0’ పథకం కింద కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, స్త్రీశక్తి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

రైతు సంక్షేమమే లక్ష్యంగా అగ్రికల్చర్ బడ్జెట్ :

బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేక అగ్రికల్చర్ బడ్జెట్‌ను కూడా మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ఈ బడ్జెట్ సాగే అవకాశం ఉంది. ఇరిగేషన్ రంగానికి కూడా ప్రత్యేక బడ్జెట్ ఉండొచ్చు. సుమారు మూడున్నర లక్షల కోట్ల వరకు బడ్జెట్ అంచనా ఉండొచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

అదేవిధంగా, రైతులకు పెట్టుబడి సాయంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకంపై కూడా ఈసారి బడ్జెట్‌లో కీలక ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. అలాగే, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా స్కూల్ విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించనుంది. ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పెంపుపై కూడా చర్యలు తీసుకోనే అవకాశం ఉంది.

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel