Vivo V60 : కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. వివో లేటెస్ట్ V-సిరీస్ స్మార్ట్‌ఫోన్ వివో V60 ఈరోజు (ఆగస్టు 12) భారత మార్కెట్లో లాంచ్ కానుంది. గత ఏడాదిలో లాంచ్ అయిన వివో V50 తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ రాబోతుంది. వివో V60 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది.
జైస్ ఆప్టిక్స్ ద్వారా పవర్ అందించే ట్రిపుల్ రియర్ కెమెరాను కూడా కలిగి ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. భారత మార్కెట్లో వివో V60 ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది.
ఈ లాంచ్ ఈవెంట్ వివో ఇండియా సోషల్ మీడియా ఛానెల్, కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. వివో V60 ఫోన్ స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
Vivo V60 స్పెషిఫికేషన్లు :
వివో V60 ఫోన్ క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆస్పియస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్‌లిట్ బ్లూ అనే కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఇంకా, వివో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.
ఇందులో 10x జూమ్ సపోర్ట్‌తో 50MP టెలిఫోటో లెన్స్, మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ మోడ్‌లు కూడా ఉంటాయి. వివో V60 ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కంపెనీ సొంత FuntouchOS 15పై రన్ అవుతుంది.
Read Also : AP Mega DSC 2025 Results : ఏపీ మెగా డీఎస్సీ 2025 రిజల్ట్స్ విడుదల.. స్కోర్‌బోర్డ్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
రాబోయే వివో స్మార్ట్‌ఫోన్‌లో జెమిని లైవ్‌తో సహా గూగుల్ జెమిని ఫీచర్లు ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్ AI క్యాప్షన్, AI స్మార్ట్ కాల్ అసిస్టెంట్‌ను కూడా అందిస్తుంది. వివో V60 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది.
Vivo V60 ఫీచర్లు (అంచనా) :
వివో V60 5G ఫోన్ 6.67-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ వివో ఫోన్ 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉండవచ్చు.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మరో 50MP కెమెరాను కలిగి ఉండొచ్చు. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌కు సపోర్టు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.
వివో V60 ధర (అంచనా) :
ఆన్‌లైన్ లీక్‌ల ప్రకారం.. వివో V60 ధర రూ.40వేల లోపు ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఆస్పిషస్ గోల్డ్, మిస్ట్ గ్రే, మూన్‌లైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని చెబుతున్నారు.