Maruti Nexa Cars : మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా? ఆగస్టు 2025లో అద్భుతమైన అవకాశం. మారుతి ఈ నెలలో ప్రీమియం నెక్సా కార్లపై (Maruti Nexa Cars) అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లను అందిస్తోంది. మీ డ్రీమ్ కారును గతంలో కన్నా మరింత సరసమైన ధరకే పొందవచ్చు.
అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈసారి మారుతి ఇన్విక్టో, మారుతి ఫ్రాంక్స్, మారుతి ఇగ్నిస్, మారుతి బాలెనో వంటి పాపులర్ మోడళ్లపై స్పెషల్ ఎడిషన్ కిట్‌లను అందిస్తోంది. మీ కారుకు మరింత స్టైలిష్, స్పెషల్ డిజైన్ అందిస్తుంది. ఇప్పుడు ఏయే కారుపై ఎంత డిస్కౌంట్ అందిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Maruti Nexa Cars : మారుతి ఇగ్నిస్ (Maruti Ignis) :
మారుతి ఇగ్నిస్ ఆటోమేటిక్ వేరియంట్‌పై మొత్తం రూ.62,500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. రూ.15వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.2100 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అదే సమయంలో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌పై రూ.25వేల క్యాష్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మారుతి ఇగ్నిస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.85 లక్షల నుంచి రూ.8.12 లక్షల వరకు పొందవచ్చు.
మారుతి బాలెనో (Maruti Baleno) :
మారుతి బాలెనో బేస్-స్పెక్ సిగ్మా వేరియంట్‌పై మొత్తం రూ.87,500 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కారుపై రూ.15వేలు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.25వేల వరకు స్క్రాపేజ్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మారుతి బాలెనోను రూ.6.70 లక్షల నుంచి రూ.9.92 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరకు అందిస్తుంది.
Maruti Nexa Cars : మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) :
ఈ ఆగస్టులో మారుతి ఫ్రాంక్స్ పై రూ.75వేల వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ఆఫర్ 1-లీటర్ టర్బో-పెట్రోల్ వేరియంట్‌పై వర్తిస్తుంది. 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ AMT వేరియంట్‌పై రూ.24వేలు, అదే ఇంజిన్ మాన్యువల్ వేరియంట్‌పై రూ.17వేలు క్యా్ష్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. CNG వేరియంట్ కొనుగోలుపై రూ.15వేల వరకు క్యాష్ డిస్కౌంట్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ధర విషయానికి వస్తే.. మారుతి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ రేంజ్ రూ.7.54 లక్షల నుంచి రూ.13.06 లక్షల వరకు ఉంటుంది.

మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara) :
ఆగస్టులో మారుతి గ్రాండ్ విటారాపై రూ.1.54 లక్షల వరకు భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ ఆఫర్ హైబ్రిడ్ వేరియంట్‌పై వర్తిస్తుంది. పాత జీటా, ఆల్ఫా పెట్రోల్ వేరియంట్‌లపై రూ.49,838 స్పెషల్ ఎడిషన్ డొమినియన్ కిట్, రూ.25వేలు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీ పొందవచ్చు. ఈ వేరియంట్‌పై రూ.60వేల వరకు ఆప్షనల్ క్యాష్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. రూ.30వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.65వేల వరకు స్క్రాపేజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ధర విషయానికి వస్తే.. ఎక్స్-షోరూమ్ రేంజ్ రూ.11.42 లక్షల నుంచి రూ.20.68 లక్షల వరకు ఉంది.
Maruti Nexa Cars : మారుతి XL6 (Maruti XL6) :
మారుతి CNG వేరియంట్‌పై మొత్తం రూ.35వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. మారుతి XL6 ఎక్స్-షోరూమ్ ధర రూ.11.84 లక్షల నుంచి రూ.14.99 లక్షల వరకు ఉంటుంది.
మారుతి జిమ్నీ (Maruti Jimny) :
మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్‌పై రూ.70వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, జీటా వేరియంట్‌పై ఎలాంటి డిస్కౌంట్ లేదు. ఈ ఆఫ్-రోడ్ SUVపై ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో లేదు. జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.76 లక్షల నుంచి రూ.14.96 లక్షల మధ్య ఉంటుంది.
మారుతి ఇన్విక్టో (Maruti Invicto) :
టాప్-స్పెక్ ఆల్ఫా ప్లస్ వేరియంట్‌పై మొత్తం రూ.1.40 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో రూ.1 లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. మారుతి ఇన్విక్టో ఎక్స్-షోరూమ్ ధర రూ.25.51 లక్షల నుంచి రూ.29.22 లక్షల వరకు పొందవచ్చు.