Stock Market Today : భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఆగస్టు 4న సానుకూలంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 50 దాదాపు 24,693 పాయింట్ల లాభాలతో (Stock Market Today) ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్, మిశ్రమ సంకేతాలు ఉన్నా దేశీయ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి.
ఈరోజు (సోమవారం) ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెన్స్ 286 పాయింట్ల లాభంతో 80,886 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ మాత్రం 96 పాయింట్లు ఎగబాకింది. 24,661 వద్ద ట్రేడ్ అవుతుంది. రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 87.24గా ఉంది.
గత ట్రేడింగ్ సెషన్ పరిశీలిస్తే.. ఆగస్టు 1న వరుసగా రెండవ సెషన్‌లో బెంచ్‌మార్క్ సూచీలు క్షీణతతో ముగిశాయి. 5వ వారం క్షీణతగా చెప్పవచ్చు. ఆగస్టు సిరీస్‌లో మొదటి రోజున నిఫ్టీ 24,600 కన్నా దిగువన ముగిసింది. అన్ని రంగాలలో ముఖ్యంగా ఫార్మా కంపెనీలలో భారీ అమ్మకాలు మార్కెట్ మూడ్‌ను దెబ్బతీశాయి. నిఫ్టీ 50 రెండేళ్లలో అతి పొడవైన వారపు క్షీణతగా నమోదైంది.
Stock Market Today : ఆసియా మార్కెట్లు
ఈరోజు ఆసియా మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్ కనిపిస్తోంది. GIFT నిఫ్టీ 89.50 పాయింట్లు లేదా 0.37 శాతం లాభంతో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిక్కీ దాదాపు 1.35 శాతం పతనంతో 40,250గా ఉంది. స్ట్రెయిట్ టైమ్స్ 0.65 శాతం పెరుగుదలను చూస్తోంది. తైవాన్ మార్కెట్ 0.73 శాతం పతనంతో ట్రేడవుతుంది. హాంగ్ సెంగ్ 0.22 శాతం లాభంతో ట్రేడవుతుంది. కోస్పి 0.90 శాతం పెరుగుదలను చూస్తోంది. షాంఘై కాంపోజిట్ కూడా 0.20 శాతం లాభంతో ట్రేడవుతోంది.
అమెరికన్ మార్కెట్ :
గత శుక్రవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 542.40 పాయింట్లు లేదా 1.23శాతం పడిపోయి 43,588.58 వద్ద ముగిసింది. S&P 500 101.38 పాయింట్లు లేదా 1.60శాతం పడిపోయి 6,238.01 వద్ద ముగిసింది. నాస్డాక్ కాంపోజిట్ 472.32 పాయింట్లు లేదా 2.24శాతం పడిపోయి 20,650.13 వద్ద ముగిసింది.

Stock Market Today : భారత మార్కెట్లకు మిశ్రమ సంకేతాలు :
భారత మార్కెట్లకు మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. FIIs, క్యాష్, ఫ్యూచర్స్ రెండింటిలోనూ అమ్మకాలు జరుపుతున్నారు. లాంగ్ షార్ట్ రేషియో దాదాపు రెండున్నర సంవత్సరాల కనిష్ట స్థాయికి తగ్గింది. ఆసియాలో మిశ్రమ ట్రేడింగ్ కనిపిస్తోంది. గత శుక్రవారం బలహీనమైన ఉద్యోగ డేటా తర్వాత US మార్కెట్లలో భారీ అమ్మకాలు జరిగాయి. అయితే, GIFT నిఫ్టీ పైకి ఎగిసింది.
ఫెడరల్ బ్యాంక్ 15శాతం, LIC హౌసింగ్ 4శాతం :
మొదటి త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ లాభం దాదాపు 15శాతం తగ్గింది. అయితే, వడ్డీ ఆదాయం 2శాతం పెరిగింది. NPA కూడా పెరిగింది. మరోవైపు, LIC హౌసింగ్ లాభం మరియు NII 4శాతం పెరిగాయి.
వడ్డీ రేట్లపై RBI MPC సమావేశం :
వడ్డీ రేట్లపై RBI MPC సమావేశం 3 రోజుల పాటు జరగనుంది. ఈరోజు మొదటి సమావేశం ప్రారంభమవుతుంది. బుధవారం వడ్డీ రేట్లపై విధానాన్ని ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యత, వృద్ధి అంచనాలను నిశితంగా పరిశీలిస్తారు.