Realme P3 Ultra 5G : రియల్‌‌మి P3 అల్ట్రా 5జీ ఫస్ట్ సేల్ మీకోసం.. ఏకంగా రూ.3వేలు తగ్గింపు.. ఆర్డర్ పెట్టుకోండి!

Updated on: April 12, 2025

Realme P3 Ultra 5G : రియల్‌మి ఫ్యాన్స్‌కు శుభవార్త. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి P3 అల్ట్రాను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ఫస్ట్ సేల్ మార్చి 25 నుంచి ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఫస్ట్ సేల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది.

ఈ సేల్ సమయంలో అనేక బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. రియల్‌మి P3 అల్ట్రా 5Gలో మీడియాటెక్ చిప్‌సెట్, 1.5K OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ భారీ బ్యాటరీ, థిన్ బాడీతో వస్తుంది. స్పెసిఫికేషన్లు, ధర, డీల్స్ గురించి తెలుసుకుందాం.

రియల్‌మి P3 అల్ట్రా 5G ధర, ఆఫర్లు :
రియల్‌మి P3 అల్ట్రా 5G మొత్తం 3 వేరియంట్లలో లాంచ్ అయింది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.26,999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.27,999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ ధర రూ.29,999కు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఈ హ్యాండ్‌సెట్ గ్లోయింగ్ లూనార్ వైట్, నెప్ట్యూన్ బ్లూ, ఓరియన్ రెడ్ కలర్ వేరియంట్లలో వస్తుంది. Realme.com నుంచి కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకుల కార్డులను వాడాల్సి ఉంటుంది.

రియల్‌మి P3 Ultra 5G స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P3 అల్ట్రా 5Gలో 6.83-అంగుళాల 1.5 కె కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. ఈ రియల్‌‌మి హ్యాండ్‌సెట్‌లో డైమెన్సిటీ 8350, 4nm ప్రాసెసర్ కలిగి ఉంది. 8GB/12GB ర్యామ్, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది. రియల్‌మి P3 అల్ట్రా 5G కెమెరా రియల్‌మి P3 అల్ట్రా 5Gలోని ప్రైమరీ కెమెరా 50MP సోనీ IMX896 సెన్సార్, OISతో వస్తుంది.

8MP సెకండరీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందిస్తుంది. బ్యాక్ ప్యానెల్‌లో LED ఫ్లాష్ లైట్ కూడా కలిగి ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. రియల్‌మి P3 అల్ట్రా 5G బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్, 6000mAh బ్యాటరీ ఉంది. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది.

Advertisement

Read Also : RBI 50 Note : రూ. 50 నోటుపై బిగ్ అప్‌డేట్.. ఆర్బీఐ కొత్త నోటు తీసుకొస్తోంది.. పాత నోట్లు చెల్లుతాయా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel