...

visa scam : వీసా ఇప్పిస్తానని చెప్పి.. పలువురి దగ్గర కోట్లు కాజేశాడు. చివరికి ఏడు ఊచలు లెక్కపెడుతున్నాడు

visa scam : ఈ మధ్య ఎక్కడ చూసినా మోసాలు, నేరాలే. విలాసాలకు అలవాటు పడిన కొందరు అడ్డదారుల్లో సులభంగా డబ్బు సంపాదించే అనేక మార్గాల్ని ఆలోచిస్తున్నారు. కేరళలోని ఇడుక్కికి చెందిన నాజర్ కన్ను విదేశాలకు వెళ్ళాలనుకొని వీసా కోసం ఎదురు చూసే వారిపై పడింది. ఇంకేం వాడి పంటపండింది. వీసా ఇప్పిస్తానని వారందరికీ మాయమాటలు చెప్పి.. వారి దగ్గరనుంచి కోట్లు కాజేశాడు. యూరోప్, గల్ఫ్ దేశాలకు వీసాల కోసం ఎదురు చూసేవారే వీడి టార్గెట్.

Advertisement

కేరళలోని ఇడుక్కి జిల్లాలోని నెడుంకందం గ్రామానికి చెందిన జెమీలా మంజిల్ అబ్దుల్ కే నాజర్ (56) యూరోప్ దేశమైన మాల్టాకు వీసా ఇప్పిస్తానని చెప్పి.. లిపిన్ అనే వ్యక్తి నుంచి రూ. 60లక్షలు తీసుకున్నాడు. అయితే చెప్పిన తేదీ దాటినీ వీసా రాకపోవడంతో.. లిపిన్ చెరుపుళ పోలీసులకు పిర్యాదు చేశాడు. పోలీసులు పిర్యాదును తాలిపంరబ డివైయస్పీకి హ్యాండోవర్ చేయడంతో .. పిర్యాదు మేరకు సైబర్ సెల్ సహాయంతో ఇడుక్కిలోని కుమిలి బస్టాండ్ లో నిందితుడ్ని అరెస్ట్ చేశారు. దీంతో కేరళలోని పలువురు యువతీ యువకుల దగ్గర వీసా పేరుతో లక్షలు కాజేసిన సంగతి వెలుగులోకి వచ్చింది.

Advertisement

కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన పలువురి నుంచి డబ్బులు తీసుకొని నాజర్ వారిని మోసం చేశాడు. చివరగా ఎర్నాకుళం కేంద్రంగా ఉన్న 32 మంది నర్సుల నుంచి సుమారు రూ. 1.25 కోట్లు వసూలు చేశాడు. అలాగే పాలా గ్రామానికి చెందిన జోషి నుంచి రూ. 15 లక్షలు, చెంగన్నూరులోని ప్రదీప్ నుంచి రూ. 13 లక్షలు, కుమిలిలో దేవి నుంచి రూ. 5 లక్షలు, షీబా నుంచి రూ. 30 లక్షలు, త్రిసూర్ కు చెందిన జోసఫ్ నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసి పరారయ్యాడు. నాజర్ నుంచి ఆ డబ్బుని తిరిగి బాధితులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement