Karthika Deepam: కార్తీక్ ఆస్తిపై కన్నేసిన చారుశీల.. హిమను తప్పుగా అపార్థం చేసుకున్న సౌర్య?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తిక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో దీప డాక్టర్ బాబు మీరు ఒక పని చేయండి నేను ప్రమాదంలో చనిపోయాను అని చెప్పి మీరు ఒక్కరే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను పోయానని తిరిగి వచ్చా అని వాళ్ళు సంతోషపడతారు అనడంతో ఏం మాట్లాడుతున్నావ్ దీప పోయేది నా ప్రాణాలు కదా అనడంతో ఇక చాలు డాక్టర్ బాబు నాకు మొత్తం తెలుసు మీ ప్రాణాలు కాదు పోయేది నా ప్రాణాలు అన్న విషయం నాకు తెలుసు అనగా కార్తీక్ షాక్ అవుతాడు. అప్పుడు వెళ్ళండి డాక్టర్ బాబు అనడంతో దీప నువ్వు మాట్లాడకు మౌనంగా ఉండు అని అంటాడు. ఆ తర్వాత సౌందర్య నేను వెళ్ళొస్తాను బాబు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

ఇంతలోనే హేమచంద్ర అక్కడికి వచ్చి చూశారు కదా కార్తీక్ ఆవిడ ఎంత బాధ పడుతుందో ఆవిడ బాధ చూసినా కూడా మీకు మనసు కరగలేదా అనడంతో అదికాదు హేమచంద్ర ఇది మాకు మేము వేసుకున్న శిక్ష అని అంటాడు. మరొకవైపు హిమ కార్తీక్ దీపల కోసం రోడ్డుమీద వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఎవరు అడిగినా కార్తీక్ వాళ్ళు నన్ను చూడలేదు అని చెప్పడంతో ఒకచోట కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే పండరి కూరగాయలు తీసుకుని వస్తుండగా ఒక అతను డాష్ ఇవ్వడంతో ఆ కూరగాయలు అన్ని కింద పడిపోతుండగా పండరి వాటిని ఏరుకుంటూ ఉంటుంది.

ఇంతలో అది చూసిన హిమ పండరీకి సహాయం చేస్తుంది. అప్పుడు పండరీని హిమ అడిగి తెలుసుకుందాం అనుకునే లోపే ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ టాబ్లెట్స్ వేసుకో దీప అనగా ఎందుకు డాక్టర్ బాబు ఈ టాబ్లెట్స్ నా ఆగిపోయే గుండెను కుట్టుకునేలా చేస్తాయా అనడంతో అలా మాట్లాడకు దీప అని అంటాడు. నువ్వు అలా మాట్లాడకు దీప ఎలా అయినా నేను నిన్ను బతికించుకుంటాను అని అనడంతో నాకు ధైర్యం చెప్పడానికి అలా అంటున్నారు కానీ నేను బతికే అవకాశాలు ఉంటే మీరు ఇలా కూర్చోరు కదా డాక్టర్ బాబు అంటుంది దీప.

అప్పుడు దీపా డాక్టర్ బాబు నేను చనిపోయాక మీరు అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా అనగా నీకేం కాదు అని చెప్పాను కదా అలా మాట్లాడకు దీప అని అంటాడు. అప్పుడు వారిద్దరూ కాసేపు ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తీక్ నువ్వు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను దీప. నీతో కలిసి జీవితాన్ని పంచుకోలేకపోయాను కనీసం చావు అయిన పంచుకుంటాను అనడంతో నువ్వు అలా మాట్లాడకు డాక్టర్ బాబు అలా మాట్లాడితే ఈ గుండె ఏ క్షణం ఆగిపోతుందో అని అంటుంది దీప. అప్పుడు వారిద్దరిని చూసి పండరి దీపమ్మకు ఏం కాకుండా చూడు దేవుడా అని అనుకుంటూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత సౌర్య, ఆనందరావు, హిమ ముగ్గురు కలిసి భోజనం చేస్తూ ఉండగా చంద్రమ్మ దంపతులు పక్కన నిలబడి ఉంటారు. ఆనందరావు రా ఇంద్రుడు మాతోపాటు వచ్చి కలిసి తిను అనడంతో పర్లేదు సార్ అంటాడు. ఏం పర్లేదు వచ్చి కూర్చో అని అనడంతో చంద్రమ్మ, ఇంద్రుడు వచ్చి డైనింగ్ టేబుల్ పై కూర్చుంటారు. అప్పుడు హిమ దీప, కార్తీక్ ల గురించి ఆలోచిస్తూ భోజనం చేయకుండా నాకేం నచ్చలేదు తాతయ్య అనడంతో ఏం జరిగింది హిమ అనగా, అమ్మ నాన్నలు బతికే ఉన్నారు కానీ మనం వాళ్ల కోసం వెతకకుండా ఇక్కడ సంతోషంగా తింటూ ఉన్నాను అని అనడంతో నాటకాలు ఆడొద్దు హిమ, మా పిన్ని బాబాయ్ లు డైనింగ్ టేబుల్ పై కూర్చుని భోజనం చేయడం నీకు ఇష్టం లేదు ఇంతవరకు మౌనంగానే ఉండి వాళ్ళు కూర్చోగానే నాటకాలు ఆడుతున్నావు అని సీరియస్ అవుతుంది.

నీకు ఇదే బుద్ధి అని సౌర్య హిమను తిడుతుంది. అది కాదు సౌర్య అనే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుండగా హిమను అపార్థం చేసుకుని ఇంద్రుడు వాళ్లను పిలుచుకునే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌర్య. మరొకవైపు చారుశీల కార్తీక్ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఆ మోనిత ఎందుకు కార్తీక్ వెంటపడుతోంది ఏదైనా కారణం ఉందా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆస్తికోసం అయితే కాదు ఆ మోనిత కి ఆల్రెడీ ఆస్తి ఉంది కాబట్టి దానిది నిజంగానే పిచ్చి ప్రేమ అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయినా దీప చనిపోయాక కార్తీక్ నీ పెళ్లి చేసుకుని కార్తీక్ ఆస్తిని సొంతం చేసుకోవాలి అనుకుంటూ ఉంటుంది చారుశీల. మరొకవైపు దీపని చూసిన కార్తీక్ నా ఇంటి దీపానివి నువ్వు అలాంటిది ఆ దేవుడు ఈ దీపాన్ని ఆరిపేయాలని చూస్తున్నాడు అనుకుంటూ ఉంటాడు కార్తీక్.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel