...

Guppedantha Manasu: దేవయానికి బుద్ధి చెప్పిన జగతి.. వసుధారను చూసి కోపంతో రగిలిపోతున్న తండ్రి?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసు, రిషి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసుధార కి జగతి ఇచ్చిన గిఫ్ట్ ఇవ్వడంతో ఏంటి సార్ ఇది అనగా నేను చూడలేదు నీకు ఇచ్చినది నేను చూస్తే బాగుండదు కదా అని అంటాడు. అప్పుడు వసుధార ఆ బాక్స్ ఓపెన్ చేస్తుండగా ఇంతలో మహేంద్ర రిషి కి ఫోన్ చేస్తాడు. చెప్పండి డాడ్ అనడంతో వెళ్లారా రిషి అనగా లేదు డాడీ ఇక్కడ వసుధర వాళ్ళ కాలేజీ చూపిస్తుంది అని అంటాడు రిషి. జాగ్రత్త రిషి అక్కడ ముందే కొత్త ప్రదేశం కొత్త మనుషులు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే ఫోన్ చెయ్యి అని పదేపదే జాగ్రత్తలు చెబుతుండడంతో నేనేమైనా యుద్ధానికి వచ్చాను డాడ్ పదేపదే జాగ్రత్తలు చెబుతున్నారు అని అంటాడు రిషి.

ఆ తరువాత వసుధార, రిషి ఇంటికి బయలుదేరుతారు. అప్పుడు వసుధార ఇంటికి కొంచెం దూరంలోనే కారు ఆపమని చెబుతుంది. ఎందుకు వసుధార అక్కడి దిగబెడతాను కదా ఆడంతో వద్దు సార్ నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాను సంతోషంతో పాటు వాళ్ళు నాపై కోప్పడతారు. ఆ క్షణంలో ఎవరైనా నిన్ను ఏదైనా అంతే నేను తట్టుకోలేను. చివరికి నా కన్నవాళ్ళు అయినా సరే నేను ఒక్క మాట అంతే నేను భరించలేను సార్ అని అంటుంది. సరే వసుధార వెళ్ళు అని అంటాడు రిషి. అప్పుడు వసుధర వెళుతుండగా లేట్ చేయకు వసుధార నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.

మన మధ్య కొంచెం దూరాన్ని అయినా నేను భరించలేను అని అనగా నేను కూడా సర్ అని అంటుంది. అప్పుడు వసుధర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు జగతి బుక్ చదువుతూ ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ఏంటి జగతి డిస్టర్బ్ చేసానా అనడంతో పర్లేదు అక్కయ్య అని అంటుంది. నువ్వు నేను రాగానే నిలబడి మర్యాదలు చేయాల్సిన అవసరం లేదు జగతి అంటూ కొంచెం ఓవర్ చేస్తూ కూర్చోబెడుతుంది దేవయాని. మనసుకు కొంచెం బాధ కలిగింది అది చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది దేవయాని.

మనసుకి ఎందుకు బాధ కలిగిందంటే రిషి వసుధార వెళ్తున్న విషయం మీరు కానీ రిషి కానీ నాకు చెప్పలేదు. అందుకే నేను రిషి కి ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్పాను అనడంతో జగతి షాక్ అవుతుంది. కానీ రిషి రాను అన్నాడు అనగా జగతి ఊపిరి పీల్చుకుంటుంది. అక్కయ్య మీరు ఎందుకు రిషి ఇష్టానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒకటి కావాలి అనుకుంటున్నారు అందుకే వెళ్ళాడు మీరు వెనక్కి రమ్మని చెప్పడం ఏంటి అని అంటుంది జగతి. వెంటనే దేవయాని నువ్వు బాగానే మాట్లాడుతున్నావు జగతి ఎంతైనా లెక్చరర్ కదా నీలాగా నాకు మాట్లాడడం రాదు కానీ చేసే పనుల్లో మాత్రం ప్రయత్నం లోపం లేకుండా చూసుకుంటాను అని అంటుంది దేవయాని.

అప్పుడు దేవయాని రిషి వసుధారల గురించి నోటికొచ్చిన విధంగా వాగడంతో పాటు నువ్వు నీ శిష్యురాలు కలిసి ప్లాన్ వేశారు రిషి ని మీ వైపుకు తిప్పుకోవాలి అనుకుంటున్నారు అనడంతో జగతి సీరియస్ అవుతుంది.. నువ్వే రిషి భవిష్యత్తును నాశనం చేస్తున్నావు అసలు నీకు రిషి అంటే ప్రేమే లేదు అనడంతో జగతి కోప్పడుతుంది. మీరు ఏమన్నా భరిస్తాను కానీ నాకు రిషి అంటే ప్రేమ లేదు అన్న మాట అంతే సహించేది లేదు అక్కయ్య అని సీరియస్ అవుతుంది. అసలు మీకు రిషి మీద ప్రేమ ఉందా.

ఎంతసేపు నా మీద కోపంతో రిషి పై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు అనడంతో దేవయాని ఆశ్చర్య పోతుంది. ఇన్నేళ్ల కాలంలో మీ విషపు ఆలోచనలు మీ బుద్ధులు ఏంటో నాకు తెలియదని అనుకుంటున్నారా. ఒక్కసారి నేను మీ విషయం రిషికి చెబితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి అని అంటుంది జగతి. అప్పుడు జగతి మాటలకు దేవయాని షాక్ అవుతుంది. నన్ను మహేంద్ర ను దూరం చేశారు నన్ను ఇంటికి రాకుండా అడ్డుకున్నారు. కానీ మీకు ఏమి ఒరిగింది ఏమి చేయలేకపోయారు కదా. ఇప్పుడు నన్ను ఏమీ చేయలేక వసుధార రిషి లను విడగొడుతున్నారు.

నన్ను ఏమన్నా భరిస్తాను కానీ నా కొడుకు జోలికి వస్తే మాత్రం సహించేది లేదు. నాకు ఓపిక ఉంటుంది ఆ ఓపిక నసిస్తే ఎలా ఉంటుందో చూపించాల్సి వస్తుంది అక్కయ్య అని అంటుంది. అప్పుడు జగతి మాటలకు షాక్ అయిన దేవయాని నీ అంతు ఆ వసుధార అంతు చూస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్లడంతో వాళ్ల అమ్మ సుమిత్ర వసుధారని చూసి ఎమోషనల్ అవుతుంది. వసుధర వాళ్ళ నాన్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నన్ను దీవించండి నాన్న నేను యూనివర్సిటీ టాపర్ అయ్యాను అనడంతో సుమిత్ర సంతోషపడుతుంది. కానీ వసుధర వాళ్ళ నాన్న మాత్రం కోపడుతూ ఉంటాడు.