Guppedantha Manasu: వసుధార ఇష్టాన్ని గౌరవించిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవయాని రాజీవ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది.

ఈ రోజు ఎపిసోడ్లో దేవయాని రాజీవ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర వదిన గారు అనడంతో షాక్ అవుతుంది దేవయాని. ఏంటి వదిన గారు ఈ టైంలో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు అనగా అప్పుడు దేవయాని అబద్ధం చెప్పడంతో అవునా సరే వదినగారు అని అంటాడు. ఆ తరువాత అందరూ హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఏంటి మహేంద్ర మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు. మనం వసుధార వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని హడావిడి చేస్తూ ఉంటుంది దేవయాని.

Advertisement

ఇప్పుడు ఫణింద్ర ఉన్నపలంగా వెళ్లాలంటే కష్టం కదా అని అనగా ఉన్నఫలంగా ఏంటండీ పంతులుగారికి ఫోన్ చేసి ముహూర్తం చెప్పమని అడిగాను అది అందుకు కావలసిన సామాగ్రి కూడా లిస్టు రాయమని చెప్పాను అని అంటుంది. వీళ్ళిద్దరి కంటే రిషి గురించి ఎలాగో పట్టదు ఇలాంటివన్నీ వీళ్ళు చూసుకోరు కనీసం నేనైనా తొందర పడాలి కదా అనిఅంటుంది దేవయాని. మరొకవైపు రుషి ఏ షర్టు వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఫోటోలు తీసి వసు కి మెసేజ్ చేస్తాడు. మరొకవైపు వసుధార ధరణి ఇద్దరు కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇంతలో రిషి మెసేజ్ చేస్తాడు.

ఏ డ్రెస్ వేసుకోవాలి అని మెసేజ్ చేయడంతో మీకు ఏదైనా సూట్ అవుతుంది సార్ మీరు ప్రిన్సెస్ కదా అని మెసేజ్ చేస్తుంది. ఆ తర్వాత దేవయాని ఏంటి మహేంద్ర నేను ఇంతలా గొంతు చించుకొని మాట్లాడుతున్న మీరు మౌనంగా ఉన్నారు అని అనగా వెంటనే ఫణీంద్ర ఇప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అనకపోతే నువ్వు మౌనంగా ఉండలేవా నువ్వు ఏదో ఏర్పాటు చేస్తున్నావ్ కదా నువ్వు చెయ్యి అని అంటాడు. ఇంతలోనేవల్ వసు అందరికీ కాఫీ తీసుకుని వస్తుంది.

అప్పుడు ఫణీంద్ర ఏంటమ్మా వసుధార మీ మేడం మీ ఇంటికి వెళ్దాం అనుకుంటుంది మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా అని అడగగా, ఫోన్ చేసి చెప్పే ఉంటుంది తెలివైన పిల్ల కదా అని దేవయాని అనడంతో, వెంటనే వసుధార దేవయానికి కౌంటర్ ఇస్తూ ఫోన్ చేయడానికి తెలివితో పని ఏముంది మేడం ఫోన్ ఉంటే చాలు కదా అనడంతో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే రిషి రావడంతో నేనే నీ దగ్గరికి వద్దామనుకున్నా రిషి అనగా ఎందుకు పెద్దమ్మ అనడంతో ఎందుకేంటి రిషి మనమందరం వసుధార వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా అని అంటుంది దేవయాని.

Advertisement

ఇప్పుడు కావాలనే రిషి మీద దొంగ ప్రేమలు చూపిస్తూ ఉంటుంది. అప్పుడు దేవయాని వెల్దామా రిషి అని అడగగా వెంటనే వసుధార నన్ను క్షమించండి నాతో మీరు ఎవరూ రావద్దు అనడంతో దేవయానితో పాటు అక్కడున్న వారందరూ షాక్ అవుతారు. అదేంటి వసుధార అని అడగగా ఈరోజు మీరు నాతో పాటు ఎవరూ రావద్దు అని అంటుంది. ఎందుకు వద్దంటున్నావు అని అడగగా సర్ మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నాదో తెలియదు అలాంటిది అందరు వెళ్లి పెళ్లి ప్రస్తావన తీసుకువస్తే అక్కడ ఇలా జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు కదా.

ముందే మా నాన్నకి చాలా కోపం ఎక్కువ నన్ను ఒక్క మాట అన్నా పర్లేదు మిమ్మల్ని ఏదైనా అంతే అది అవమానించినట్టే అవుతుంది అని అంటుంది వసుధార. అప్పుడు రిషి సరే పెద్దమ్మ తన మాటలన్నీ గౌరవిద్దాం అనడంతో దేవయాని షాక్ అవుతుంది. బయలుదేరు అని అనగా ఆ తర్వాత వసుధార అందరికీ బాయ్ చెప్పి బయలుదేరుతూ రిషి ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అనగా ఇవి మీరు చూపిస్తున్న ఆనందానికి సర్ అనడంతో ఏడవకు వెళ్ళు ఎటువంటి కష్టం వచ్చిందని నీ వెనుక ఈ రిషి ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు అని అంటుంది. ఆ తర్వాత నుంచి వెళ్ళిపోతూ ఉండగా తీసి జాగ్రత్తగా వెళ్లు వసుధార అని మెసేజ్ చేస్తాడు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel