...

Karthika Deepam: దీప బాధను చూసి కుమిలి పోతున్న కార్తీక్.. చారుశీలతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్న సౌర్య?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప నుంచి ఇంద్రుడు, చంద్రమ్మ తప్పించుకొని వెళ్ళిపోతారు.

Advertisement

ఈ రోజు ఎపిసోడ్ సౌర్య పేపర్ చదువుతూ ఉండగా ఇంతలో చంద్రమ్మ అక్కడికి వచ్చి జ్వాలమ్మ నువ్వు స్కూల్ కి వెళ్తావా అని అనగా వద్దు పిన్ని అని అంటుంది. పర్లేదు జ్వాలమ్మ వెళ్ళు మా స్తోమత కొద్దీ చదివిస్తాను అనగా అవసరం లేదు పిన్ని అని అంటుంది. అవును పిన్ని మీకు హాస్పిటల్ లో మాట్లాడించావు కదా ఆ చారుశీల మేడం తెలుసా అనకా తెలుసమ్మా ఇంతకుముందు వాళ్ళ ఇంట్లోనే పని చేసాము కాకపోతే దొంగతనం చేయడం వల్ల మానేశాము అని అంటుంది. అప్పుడు సౌర్య చంద్రమ్మ నీ తిడుతుంది.

Advertisement

Advertisement

నేను ఆ డాక్టర్ అమ్మతో స్నేహం చేస్తాను మా నాన్న కూడా డాక్టర్ కాబట్టి తప్పకుండా తెలిసే ఉంటుంది. అప్పుడు మేమిద్దరం కలిసి వెతుకుతాము అనడంతో సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇందిరమ్మ. మరొక వైపు దీప జరిగిన విషయాలు తలుచుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. ఏంటి దీప ఇంకా ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అవును డాక్టర్ బాబు వాళ్ళు చిక్కినట్టే చిక్కి పారిపోయారు అని అనుకుంటూ ఉంటుంది. నాకేం మాయరోగం వచ్చింది డాక్టర్ బాబు అసలు నాకేమైంది అనగా ఏమైంది దీప అనడంతో చెప్పండి డాక్టర్ బాబు నేనేమైనా పోతానా అనడంతో అలా మాట్లాడకు దీప అని అంటాడు కార్తీక్.

Advertisement

మరి ఎందుకు డాక్టర్ బాబు ఆ ఇంద్రుడు వాళ్ల వెనకాల పరిగెత్త లేకపోయాను హాస్పిటల్ బయటకు వచ్చేసరికి నాకు ఓపిక లేదు అంటుంది దీప. మొన్ననే కదా దీప ఆపరేషన్ జరిగింది అంత లోపల అలా ఎలా నయమవుతుంది అని అంటాడు కార్తీక్. వాళ్లు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినట్టు చిక్కి తప్పించుకున్నారు డాక్టర్ బాబు. మనం ఇక్కడే ఉన్నామని తెలిస్తే వాళ్ళు ఈ ఊరు విడిచి వెళ్లిపోతారు కదా అనగా ఎక్కడికి వెళ్లినా ఎన్ని ఊర్లు తిరుగుతారు అని అంటాడు కార్తీక్. డాక్టర్ బాబు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు పరిగెత్తారు కదా మరి వాళ్ళు ఎందుకు హాస్పటల్ కి వచ్చారు అనగా ఎవరికైనా బాగోలేకపోతే వచ్చాడేమో దీప నాకు తెలియదు అని అబద్ధం చెబుతాడు కార్తీక్.

Advertisement

మరొకవైపు సౌందర్య ఆనందరావుకి ఫోన్ చేయగా వెళ్ళావా సౌందర్యా అక్కడంతా బాగానే ఉందా అనడంతో వచ్చి చాలాసేపు అయింది ఇప్పటివరకు కార్తీక్ వాళ్ళ కోసం వెతికి ఇప్పుడే రూమ్ కి వచ్చాను అంటుంది సౌందర్య. అప్పుడు ఆనందరావు బయట చాలా చలిగా ఉంది ఎక్కువగా తిరగకు సౌందర్య ఆరోగ్యం పాడవుతుంది అని అనగా పోతే పోయింది నాకు నా కొడుకు కోడలే ముఖ్యం వాళ్ళు కనిపిస్తే చాలు అని అంటుంది సౌందర్య. మరి వెతికావు కదా ఏమైనా కనిపించారా అనడంతో లేదండి వారి జాడ ఇంకా కనబడలేదు అంటూ బాధతో మాట్లాడుతుంది సౌందర్య.

Advertisement

ఫోన్ కట్ చేసిన తర్వాత ఎక్కడున్నారు కార్తీక్ మీ మమ్మీ మీకోసం పిచ్చిదానిలా వెతుకుతోంది కనిపించండి అంటూ ఎమోషనల్ అవుతాడు ఆనందరావు. ఆ తర్వాత దీప జరిగిన విషయాలు తలచుకొని బాధతో కుమిలిపోతూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి నాకు అనవసరంగా గతం గుర్తుకు వచ్చింది దీప. నువ్వు ఇలా బాధపడుతుంటే చూసి ఓదార్చలేను సౌర్యను తీసుకుని రాలేను. అనవసరంగా నా లైఫ్ లోకి వచ్చావు దీప. వచ్చినప్పటి నుంచి నీకు సంతోషం లేకుండా చేశాను అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీప దగ్గరికి వెళ్లిన కార్తీక్ దీపను ఓదారుస్తూ ఉంటాడు. ఆ తర్వాత దీప పడుకుని ఉండగా ఇంతలో పండరి అక్కడికి వచ్చి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది.

Advertisement

ఇంతలోనే కార్తీక్ దీప నీ నిద్ర లేపడానికి వెళ్లగా వద్దు డాక్టర్ బాబు తనకి విశ్రాంతి చాలా ముఖ్యం అని అంటుంది. మీరు జాగింగ్ వెళ్ళొచ్చారు కదా మీకోసం క్యారెట్ జ్యూస్ కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది పండరి. ఆ తర్వాత దీప,కార్తీక్ ఇద్దరు హాల్ లో కూర్చుని ఉండగా ఇంతలోనే అక్కడికి పండరీ వాళ్ళ కోసం క్యారెట్ అవి తీసుకుని రావడంతో నాకెందుకు ఇవి అని అనగా గుండెకు చాలా మంచిది దీపమ్మ తిను అని అంటుంది. తినాల్సిందే నువ్వు తిను ఇంకా వేరే ప్రశ్నలు వేయకూడదు అని అంటుంది పండరి. అప్పుడు కార్తీక్ పండరిని చూసి చూసావు కదా డాక్టర్ని నన్ను ఏం మాట్లాడకుండా చేస్తుంది అని అంటాడు. ఆ తర్వాత వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మరొకవైపు శౌర్య చారుశీల కోసం హాస్పిటల్ కి వెళ్ళగా సౌర్యను చూసిన చారుశీల ఒకసారిగా షాక్ అవుతుంది.

Advertisement
Advertisement