...

AP04 Ramapuram Movie Review : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘AP04 రామాపురం’ మూవీ రివ్యూ 

AP04 Ramapuram Movie Review : అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, యస్ యస్ కుమార్ నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి అందూరి నిర్మించిన చిత్రం ”AP04 రామాపురం”. డిసెంబర్ 9న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

 కథ :
రామాపురం లో  డ్యూటీ చేసే  ఇన్స్పెక్టర్ ఒక చెట్టుకు ఊరిసుకొని చనిపోతాడు. ఆ ఊరి జనం మాత్రం ఇది హత్య కాదు ఆత్మహత్య అంటారు. కానీ యస్. పి. ఆఫీస్ లో  పోస్ట్ మార్టమ్ రిపోర్టులో మాత్రం ఇది హత్య అని తెలుస్తుంది. దీంతో  అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రామాపురంకి ఒక కొత్త ఎస్ఐ ( పి. యన్ రాజ్) ను అపాయింట్మెంట్ చేస్తారు .ఆ వ్యక్తి  ఆ ఊరికి వచ్చి అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అదే రామాపురానికి అగ్రికల్చర్  డెవలప్మెంట్ కోసం కేంద్రీయ వ్యవసాయాన్ని డెవలప్ చేసే స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి హీరో రామ్(రామ్ జక్కల) వస్తాడు.విలేజ్  డెవలప్మెంట్ లో భాగంగా ఆ ఊరిలో తిరుగుతున్న రామ్ కు ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన అఖిల (అఖిల ఆకర్షణ) అనూహ్యంగా అక్కడ కనిపించడంతో షాక్ అయ్యి కొంత ఎమోషనల్ అవుతాడు.

ap04-ramapuram-movie-review-and-rating-in-telugu
ap04-ramapuram-movie-review-and-rating-in-telugu

వీరిద్దరూ గతంలో లవ్ ప్రపోజ్ చేసుకునే రోజు హీరోయిన్ తన దగ్గర రాకుండా ఫోన్  స్విచ్చాఫ్ పెట్టుకొంటుంది తనెందుకు ఇలా చేసిందో అర్థం కానీ రామ్ కు అఖిల ఈ ఊర్లో కనిపించడం, తను కూడా ఎదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ ఊర్లో ఉండే కఠినమైన కట్టుబాట్లు అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎవరూ తల ఎత్తి చూడకూడదు అలా చూసిన వారికి వంద కొరడా దెబ్బలు తో పాటు ఊరి బహిష్కరణ అనే కట్టుబాట్లు ఉంటాయి.

నటీనటులు : రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ,యస్ యస్ కుమార్,పి యన్. రాజ్, తదితరులు..

సినిమా :  ”AP04 రామాపురం”
రివ్యూ రేటింగ్ : 3/5
సమర్పణ : ఎస్.వి. శివ రెడ్డి…
బ్యానర్ : అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్
ప్రొడ్యూసర్ – రామ్ రెడ్డి అందూరి…
దర్శకుడు – యు . హేమ రెడ్డి…
సహ నిర్మాత : డి. యల్లారెడ్డి
సంగీతం – సాకేత్ వేగి & అబు…
కెమెరా మెన్ – మల్లి కె చంద్ర & వినయ్ కుమర్ జంబరపు…
బ్యాగ్రౌండ్ స్కోర్ : సుదీప్ కుర్ణి
ఎడిటర్ : యం. డి. నాగూర్ వలి
కొరియోగ్రాఫర్ – రవి తేజ & కిషోర్ ఆర్. కె
పి.ఆర్.ఓ.. మధు వి.ఆర్

ap04-ramapuram-movie-review-and-rating-in-telugu
ap04-ramapuram-movie-review-and-rating-in-telugu

ఈ కారణంగా అఖిల, రామ్ కు ఏమీ చెప్పలేక పోతుంది. ఇదిలా ఉండగా ఆ ఊరిలో చనిపోయిన వ్యక్తి గురించి యస్సై పి. యన్ రాజు ఆ ఊరిలో ప్రతి ఇంటికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో ఆ ఊరి విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (VRO) కూడా అదే చెట్టుకు ఊరేసుకొని చనిపోతాడు. అయితే చని పోయిన VRO జేబులో లెటర్ ను గుర్తించగా అందులో నాకు షుగర్ ఉంది ఈ జబ్బు వళ్ళ ఈ ఊరి రైతులకు సరైన న్యాయం చేయలేక పోతున్నాను అందుకే చనిపోతున్నాను అని రాసి ఉంటుంది. ఆ లెటర్ ఆధారంగా ఇది కూడా ఆత్మ హత్యని నిర్దారిస్తారు.

అయితే ఆ ఊరి సర్పంచ్ హీరోయిన్ ఫాదర్ ఈశ్వర్ రెడ్డి (ఎస్ఎస్ కుమార్)ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఆ ఎస్సై తో వాదిస్తాడు.ఆ ఎస్సై ఇది హత్య అని చెప్పే ప్రయత్నం చేయగా అందరూ ఆ ఎస్సై ను అనుమానిస్తారు. ఈ క్రమంలో  హీరో రామ్ పై కూడా ఆటాక్ జరుగుతుంది. ఇది ఎవరు చేశారని  తెలుసుకుంటుండగా మళ్ళీ ఆ ఊరి గ్రామ పంచాయతీ సెక్రెటరీ కూడా అదే చెట్టుకు ఉరివేసుకుని చనిపోతాడు.

అయితే ఆ ఊరికి మంచి చేయడానికి వచ్చి ప్రతి ఒక్కరిపై అటాక్ జరగడం, లేక చనిపోవడం జరుగుతుంది.ఇలా ఆ ఊర్లో వరుసగా అదే చెట్టుకు ఊరేసుకొని ఎందుకు చనిపోతున్నారు? నిజంగా వారిని ఎవరైనా చంపుతున్నారా..  లేక వాళ్లకు  వాళ్లే చని పోతున్నారా..  ఇలా ఆత్మహత్యలు జరగడానికి కారణం ఏమిటి? ఈ హత్యల వెనుక ఎవరు ఉన్నారు? ఆ ఊరిలో జరిగేవి హత్యలా లేక ఆత్మ హత్యలా..? ఆ ఇలాంటి కఠినమైన కట్టుబాట్లు ఎందుకు పెట్టారు.. ఇలాంటి తరుణంలో అఖిల, రామ్ లు ఎలా కలుసుకున్నారనే కథను తెలుసుకువాలంటే  “AP 04 రామాపురం”  సినిమా చూడాల్సిందే

నటీ నటుల పని తీరు 
రాం పాత్రలో నటించిన (రామ్ జక్కల)కు ఇది మొదటి సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న నటుడులా చాలా బాగా చేశాడు. చక్కటి ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్‌ లలో తన కిచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. హీరోయిన్ అఖిల ఆకర్షణ ఎన్నో సినిమాలు చేసినా..పల్లెటూరి అమ్మాయి గా తన అందం  అభినయంతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. రామ్, అఖిల ల ప్రేమ, భావోద్వేగాల సన్నివేశాలలో చక్కగా నటించి యూత్ ను ఆకట్టుకున్నారు… పోలీస్ ఆఫీసర్ పాత్రలో  పి యన్. రాజ్ చాలా బాగా చేశాడు , హీరోయిన్ అఖిల తండ్రి సర్పంచ్ పాత్రలో ఈశ్వర్ రెడ్డి గా నటించిన ఎస్ ఎస్ కుమార్ భావోద్వేగమైన డైలాగ్స్ తో తన నటనతో అద్భుతంగా నటించాడు ఈ సినిమాకు ఈయనే డైలాగ్స్ రాయడం విశేషం.ఇలా ఇందులో నటించిన  వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారాని చెప్పవచ్చు.

 సాంకేతిక నిపుణుల పని తీరు :
వరుస హత్యలు జరిగే డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ కథను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకులలో ఎంతో క్యూరియాసిటీని కలిగిస్తూ లవ్, ఫ్రెండ్షిప్, డ్రామా సస్పెన్స్, థ్రిల్లర్ వంటి చక్కటి కథతో దర్శకుడు యు .హేమ రెడ్డి చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా బ్యాక్ టు బ్యాక్  స్క్రీన్ ప్లే తో చాలా చక్కగా తెరకెక్కించాడు.ఈ సినిమాకు సుదీప్ కుర్ణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్  చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది.సంగీత  దర్శకులు సాకేత్ వేగి  & అబు లు ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్స్ మల్లి కె. చంద్ర & వినయ్ కుమర్ జంబరపు ఇద్దరూ మంచి లొకేషన్స్ లను సెలెక్ట్ చేసుకొని అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు.

నాగూర్ వలీ ఎడిటింగ్ పనితీరు బాగుంది.ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత రామ్ రెడ్డి అందూరి ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్స్ & టర్న్స్ ఉంటాయి. చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా చాలా థ్రిల్ ను కలిగిస్తుంది. డ్రామా,క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే  ప్రతి ఒక్కరికీ “AP04 రామాపురం” సినిమా కచ్చితంగా  నచ్చుతుంది.

Read Also : Love Movie Review : లవ్ మూవీ రివ్యూ.. గుండెకు హత్తుకునే ప్రేమ..!