Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవయాని రిషి ఇద్దరు ఫణీంద్ర రాక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రిషి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నారు సార్ అనడంతో పెదనాన్న వచ్చి డాడ్ వాళ్ళ గురించి అడిగితే ఏం చెప్పాలి వసుధార, వాళ్లు వెళ్లిపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని పెదనాన్న ప్రశ్నిస్తే నేను ఏం సమాధానం చెప్పాలి అని అంటాడు రిషి. అప్పుడు వసుధర తన మనసులో మహేంద్ర సార్ మీరు వెళ్లిపోయి రిషి సార్ ని చాలా బాధ పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రిషి అంటే బాధ పడతావు కానీ మీ మేడం కూడా చాలా కఠినంగా ఆలోచిస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
మరొకవైపు దేవయాని ఈయన ఊరు నుంచి వస్తున్నారు. ఆయన చెప్పక ముందే మీ పెదనాన్న అది చెప్పాడు ఇది చెప్పాడు అని రిషికి అబద్దాలు చెప్పాను పొరపాటున రిషి ఆ మాటలు ఆయన్ని అడిగితే నేను అడ్డంగా దొరికిపోతాను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని దేవయాని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణి కాఫీ తీసుకొని వస్తుంది. అప్పుడు దేవయాని కరెక్ట్ సమయానికి కాఫీ తీసుకొని వచ్చావు ధరణి అని అంటుంది. అప్పుడు ధరణి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఈ జగతి వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉంటారు ధరణి అనడంతో నాకెలా తెలుస్తుంది అత్తయ్య అని అంటుంది.
తెలుసుకోవాలి ధరని అయినా తెలుసుకొని ఏం లాభం లేదు నువ్వు ఏం చేస్తావు అని అంటుంది. అప్పుడు ఎలా అయినా వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి ధరణి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని. మరొకవైపు వసుధర గురించి జగతి బాధపడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు జగతి అనడంతో నాకు వసు, రిషి ల ఆలోచనలు తప్ప ఏమి ఉంటాయి మహేంద్ర అని అంటుంది. అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రావడంతో టెన్షన్ పడుతూ ఉంటారు.
అప్పుడు వెంటనే గౌతమ్ కి కాల్ చేసి వాళ్ళు వెళ్లి దాక్కుంటారు. ఇప్పుడు లోపలికి వచ్చిన రిషి వసుధర ను గౌతమ్ అని పిలుస్తూ ఉంటారు. అప్పుడు గౌతమ్ పలకకపోయేసరికి పైన ఉన్నాడేమో అని జగతి వాళ్ళు ఉన్న రూంలోకి వెళ్లి చూస్తూ ఉండగా ఇంతలోనే గౌతమ్ అక్కడికి వస్తాడు. ఎక్కడికి వెళ్లావు అని అనడంతో అబద్ధాలు చెబుతాడు. అప్పుడు సరే గౌతమ్ పదా డాడీ వాళ్ల గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనటంతో జగతి దంపతులు షాక్ అవుతారు. అప్పుడు గౌతమ్ వద్దు అనడంతో నీకు అర్థం కాలేదు గౌతమ్ అంటూ గౌతమ్ మీద సీరియస్ అవుతాడు.
పెదనాన్న వస్తున్నాడు ఆయన అడిగితే నేనేం సమాధానం చెప్పాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వెళ్దాం పద అనటంతో గౌతమ్ వద్దు అని కన్విన్స్ చేస్తాడు. అప్పుడు వసుధార రిషి సార్ జగతి మేడం వాళ్ళు వెళ్లినప్పటి నుంచి ఎంత బాధ పడుతున్నారో నాకు తెలుసు అని అనడంతో జగతి దంపతులు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత నుంచి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి వచ్చి గౌతమ్ సారీ రా ఏదో బాధలో ఉన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఆ తరువాత జగతి దంపతులు జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జగతి మహేంద్ర దగ్గరికి వెళ్లి ఇక చాలు మహేంద్ర ఇంక రిషి ని బాధ పెట్టొద్దు మనం అక్కడికి వెళ్లి పోదాం అని అంటుంది. అప్పుడు మహేంద్ర అది కాదు జగతి మనం ఏదో అనుకుని బయటకు వచ్చాము అదే జరిగే అంతవరకు ఓపిక పడదాము అనటంతో జగతి మాత్రం లేదు మహేంద్ర రిషి ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు వెళ్ళిపోదాం అని అంటుంది. అప్పుడు గౌతమ్ ఆంటీ చెప్పేది కరెక్టే కదా అంకుల్ అనడంతో నువ్వు నాకు సలహాలు ఇచ్చే వాడివి అయ్యావా గౌతం అని గౌతమ్ మీద సీరియస్ అవుతాడు మహేంద్ర.