Guppedantha Manasu Oct 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు, దేవయాని ని రిషి ముందు అడ్డంగా ఇరికిస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసు, సర్ నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేడం నన్ను బాగా చూసుకుంటున్నారు సార్. నీకు తోడుగా ఉంటూ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నందుకు నన్ను కూడా అభిమానిస్తూ మెచ్చుకుంటున్నారు. వీలైతే ఇక్కడే ఉండు వెళ్ళొద్దు అని నన్ను బ్రతిమిలాడుతున్నారు కావాలంటే మేడం ని అడగండి అవును కదా మేడం అనటంతో దేవయాని ఏమి చేయలేక అవును అని తల ఊపుతుంది.
అప్పుడు రిషి మీరు వసుకి థాంక్స్ చెప్పడం ఏంటి పెద్దమ్మ వసదార మన కుటుంబ సభ్యురాలు కదా అని అనడంతో దేవయాని షాక్ అవుతుంది. అప్పుడు వసుధార మాటలకు దేవయాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వెళ్ళొస్తాం పెద్దమ్మ అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్ళగా వసుధర దేవయాని దగ్గరికి వెళ్లి నవ్వుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బయలుదేరుతూ ఉండగా కారు ఎక్కుతూ మహేంద్ర గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు.
అప్పుడు వసుధార రిషి సార్ బాధకు నేనే కారణం ఇదంతా కూడా నా వల్లే వచ్చింది. నేను మరీ మొండిగా ప్రవర్తించడం వల్లే ఇన్ని అనర్ధాలు జరుగుతున్నాయి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వసుధార రిషి దగ్గరికి వెళ్లి సర్ అని పిలవగా వసు నేను ఇంత బాధపడుతున్నాను కదా వాళ్లు కూడా అంతే బాధపడుతూ ఉంటారా అని అడుగుతాడు. మీ కంటే ఎక్కువే బాధపడుతూ ఉంటారు సార్ అని అనడంతో మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్లాలి అని అంటాడు.
Guppedantha Manasu : ధరణి మాటలకు షాక్ దేవయాని..
ఇప్పుడు వసు మీ అందరిలో ఒకే లక్షణాలు ఉన్నాయి సార్ అందరినీ ప్రేమిస్తారు అభిమానిస్తారు కానీ మొండి వాళ్ళు అని అంటుంది. అప్పుడు ఎలా అయినా ఈ విషయానికి పరిష్కారం ఆలోచించి అందర్నీ ఒక్కటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు జగతి,మహేంద్ర హలో కూర్చుని ఉండగా ఇంతలో జగతికి వసుధార సారీ అని మెసేజ్ పెడుతుంది. దాంతో జగతి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మహేంద్ర ఉండలేకపోతున్నాను అని అంటుంది.
కానీ మహేంద్ర మాత్రం ఇప్పుడే కాదు జగతి. ఇన్ని రోజుల మనం అజ్ఞాతానికి విలువ ఉండదు. వసు ఆ గురుదక్షిణ ఒప్పందాన్ని పూర్తిగా తొలగించాలి అని అంటాడు. అప్పుడు జగతి నువ్వు లేకుండా రిషి ఉండలేకపోతున్నాడు. రిషి లేకుండా నువ్వు కూడా ఉండలేకపోతున్నావు. ఇలాగే ఉంటే మన బంధాలు ఇంకా దూరం అవుతాయి రిషి దగ్గరికి వెళ్లి పోదామని జగతి అంటుంది. కానీ మహేంద్ర మాత్రం నన్ను బలవంతం పెట్టొద్దు జగతి అని అంటాడు.
మరొకవైపు దేవయాని ఒంటరిగా కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి ధరణి రావడంతో ఇలా రాదని అని అంటుంది. చెప్పండి అత్తయ్య అని అనగా ఒకసారి కూర్చో నీతో మాట్లాడాలి అనడంతో దేవయాని అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కాక ధరణి అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు ధరణిని వెళ్లి ఫోన్ తీసుకుని రమ్మని చెబుతుంది. అప్పుడు ధరణి ఫోన్ లో మహేంద్ర వాళ్ళ నెంబర్లు ఉన్నాయేమో చెక్ చేస్తూ ఉంటుంది.
లేవు అత్తయ్య చిన్నతయ్య చిన్న మామయ్య ఎక్కడికి వెళ్లారు నాకు కూడా చెప్పలేదు అని అంటుంది. ఆ తర్వాత ధరణి తెలివిగా మాట్లాడుతూ దేవయానిని ఫోన్లో పాము ముంగిస ఆడుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు మహేంద్ర రిషి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి భోజనం తీసుకుని వస్తుంది. అప్పుడు జగతి భోజనం తినిపిస్తూ ఉండగా జగతి స్థానంలో రిషి వచ్చాడు అని ఊహించుకుంటాడు మహేంద్ర.
Read Also : Guppedantha Manasu Oct 28 Today Episode: కంటతడి పెట్టిన రిషి.. బాధతో కుమిలిపోతున్న వసుధార..?