Karthika Masam 2022 : తెలుగువారికి ఎంతో ముఖ్యమైన మాసం.. కార్తీక మాసం (Karthika Masam 2022). ఈ కార్తీక మాసం పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం చేసినవారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. అంతేకాదు.. రాత్రి సమయంలో నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. అలా చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
ఈ మాసంలో అన్ని రోజులు మంచి రోజులే.. అందులో ముఖ్యమైన రోజులు భగినీ హస్తభోజనం, నాగపంచమి, నాగులచవితి, క్షీరాబ్ధి ద్వాదశి, ఉత్థాన ఏకాదశితో పాటు చివరిగా కార్తీక పౌర్ణమి వస్తుంది. ప్రతి సంవత్సరంలో దీపావళి తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది.
ఈ మాసంలో భక్తులందరూ శివ పూజ చేస్తుంటారు. హరిహరాదులకు కూడా ఈ మాసంలో ఎంతో విశిష్టమైనది. భక్తులు తమ కోరికలను తీర్చమంటూ నోములు చేస్తుంటారు. ఈ మాసంలో చవితి, పౌర్ణమి, పాఢ్యమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి తిధుల్లో శివపార్వతుల పూజలను ఎక్కువగా మహిళలు చేస్తుంటారు. ఈ సందర్భంగా రోజూ ఉపవాసంతో పాటు స్నానం, దానం చేస్తుండాలి.
Karthika Masam 2022 : కార్తీక మాసంలో ఏ దైవారాధన మంచిది..
అలా చేస్తే ఎన్నో రెట్లు ఫలితాలను పొందవచ్చు. విష్ణువుకు తులసి దళాలు, జాజి, అవిసెపువ్వు, మల్లె, కమలం, గరిక, దర్బలతో శివుని బిల్వ దళాలు, జిల్లేడు పూలతో పూజలు చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని మహా పండితులు చెబుతున్నారు. ఉదయమే స్నానం చేయాలి. రాత్రికి మాత్రం భోజనం చేయరాదు. పాలు పళ్ళు తినవచ్చు. కార్తీ మాసంలో నారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతాలను చేసుకోవచ్చు.
ఏది మంచిదంటే :
ఈ మాసంలో కార్తీక స్నానాలు, దానాలు, జపాలతో అనంతమైన పుణ్యఫలితాలను పొందవచ్చు. రోజు ఇలా చేయలేకుంటే ద్వాదశి, ఏకాదశి, పూర్ణిమ, సోమవారాలలో ఒక్క పూర్ణిమ, సోమవారం వచ్చిన నాడు నియమాలు నిష్టలతో ఉపవాసం చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు.. కార్తీక పౌర్ణమి రోజున గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే.. అనేక జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు. కార్తీక పౌర్ణమినాడు రోజుంతా ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత శివాలయంలో రుద్రాభిషేం చేయించుకుంటే సమస్త పాపాలు తొలగిపోయి ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా స్త్రీ కార్తీక దీపారాధన చేస్తే సౌబాగ్యంతో కలకలం సంతోషంగా ఉంటారు.
ఏది చేయరాదంటే :
ఈ మాసంలో ఎంతో నిష్టగా ఉండాలి. ముఖ్యంగా తినే వంటకాల్లో వెల్లుల్లి, ఉల్లి, మాంసం, మద్యం జోలికి వెళ్లకూడదు. ఎవరికి కూడా ద్రోహం చేయొద్దు. పాపపు ఆలోచనలు కూడా మంచిది కాదు. దైవ దూషణ చేయరాదు. దీపారాధనకు ఉపయోగించే నువ్వుల నూనెను ఇతర అవసరాలకు వినియోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుతో స్నానం చేయరాదు. కార్తీక వ్రతాన్ని చేసే భక్తులు ఆ వ్రతం చేయనివారు వండిన చేతివంట అసలు తినకూడదు. కార్తీకమాసంలో చేసే దీపారాధనతో గతజన్మ పాపాలు, ఈ జన్మలో చేసిన పాపాలన్నీ భస్మీ పటలమై పోతాయి.
Read Also : Bilva Patra : కార్తీక మాసంలో శివయ్యను ఈ పత్రంతో పూజిస్తే కోరిన కోరికలన్నీ తీరుస్తాడు..