Fire crackers : ఒక్కొక్కరిది ఒక్కో తిక్క ఉంటుంది. వారి పిచ్చే వారికి ఆనందం. ఎంత పిచ్చి ఉన్న వారు అయినా దీపావళికి టపాసులు కాలుస్తారు. అంతే కానీ కారును కాల్చుకోరు కదా. కానీ అలా కారు కాల్చే. వారిని ఎవరైనా ఏమని పిలుస్తారు. పిచ్చోళ్లు అంటారు. లేకపోతే యూట్యూబర్స్ అంటారు. ఒకరు తమకు ఉన్న పిచ్చితో అలాంటి పనులు చేస్తారు. మరొకరు తమ వీడియోలకు వ్యూస్ కావాలని అలాంటి పిచ్చి పనులు చేస్తారు. అలాంటి ఓ యూట్యూబర్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Crazy XYZ అనే యూట్యూబర్ కు చెందింది ఆ వీడియో. దీపావళి సందర్భంగా ఆ యూట్యూబర్ చేసిన పని మామూలు పని కాదు. అందరిలా టపాసులు కాలిస్తే ఏం కిక్కు ఉంటుంది అనుకున్నాడేమో చాలా డిఫరెంట్ గా థింక్ చేశాడు. రాజస్థాన్ లోని అల్వర్ కు చెందిన యూట్యూబర్ అమిత్ శర్మ.. ఓ కారుకు టపాసులు అమర్చాడు.