Viral Video : వీడి టాలెంట్ తగలెయ్యా.. వెంట్రుకవాసిలో ప్రాణాలు గాల్లో కలిసేవి.. షాకింగ్ వీడియో వైరల్!

Updated on: October 22, 2022

Viral Video: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. నెలల కొద్దీ సాగుతున్న ఆ యుద్ధ ప్రభావం యావత్ ప్రపంచంపై పడింది. అటు అమెరికా నుండి ఇటు ఆస్ట్రేలియా వరకు ప్రతి దేశంపై యుద్ధం తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదంలో పడిపోయాయి.

అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అయితే రేపో, మాపో ఆర్థిక మాంద్యం వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వేలాది మంది ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షలాది మంది తమ దేశాన్ని వదిలి ఇతర దేశాలకు పారిపోతున్నారు.

Advertisement

Advertisement

క్షిపణులు, ట్యాంకర్లు, డ్రోన్లు, చాపర్లతో యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు చెందిన ఓ చాపర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను ఉక్రెయిన్ రక్షణ శాఖే ట్విట్టర్ లో పోస్టు చేసింది. అందులో ఏముందంటే.. ఉక్రెయిన్ లోని ఒక హైవేపై ఒక చాపర్ వ్యతిరేక దిశలో వేగంగా దూసుకువస్తోంది. చాలా తక్కువ ఎత్తులో ఎగురుతూ వచ్చిన ఆ చాపర్.. ఎదురుగా వస్తున్న ఓ కారుకు సమీపంలోకి వచ్చింది.

కారులో ఉన్న వ్యక్తులు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకున్నారు. ఇక వచ్చి ఢీకొట్టుందేమో అనుకోగానే.. ఆ చాపర్ కాస్త వెంట్రుకవాసిలో కారు నుండి దూరంగా వెళ్లిపోయింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేసిన ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్కం టు ఉక్రెయిన్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. రష్యా రాడార్లకు దొరక్కుండా ఉక్రెయిన్ చాపర్లు ఇలా తక్కువ ఎత్తులో వెళ్లడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయి.

Read Also : Viral Video : ఈ పిల్లాడిని పెద్ద నాగుపాము బుసకొడుతూ చుట్టేసింది.. చివరికి ఏమైందంటే? వణుకుపుట్టించే షాకింగ్ వీడియో..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel