Spam Calls : స్పామ్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Updated on: October 22, 2022

Spam Calls: లోన్ కావాలా, క్రెడిట్ కార్డు ఇస్తామంటూ రోజూ ఎన్నెన్నో ఫోన్ కాల్స్ వస్తుంటాయి. కొత్త నంబర్ నుంచి ఫోన్ రాగానే ఎవరు చేస్తున్నారనే ఆసక్తితో కాల్ అటెండ్ చేస్తాం. స్పాం కాల్ అని తెలిసి కోపంగా కట్ చేసేస్తాం. అవసరం లేదని చెప్పినా పదే పదే ఇలాంటి కాల్స్ వస్తుంటే అసహనానికి గురవుతూ ఉంటాం. మరోవైపులాటరీ తగిలిందని, మీ క్రెడి్, డెబిట్ కార్డు ముగిసిందంటూ మోసపూరిత కాల్స్ వస్తుంటాయి. మరీ విసుగు పుట్టించే స్పామ్ కాల్స్ ని ఎలా అడ్డుకోవాలో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.

స్పామ్ కాల్స్ లో టెలీ మార్కెటింగ్ కాలస్, రోబో కాల్స్, స్పామ్ కాల్స్ అని మూడు రకాలు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు ఫోన్ సెట్టింగ్స్ లో ఏమోం మార్పులు చేయాలో తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ యాజర్లకు కాలర్ ఐడీ, స్పామ్ ప్రొటెక్షన్ అనే రెండు ఫీచర్లను గూగల్ అందిస్తుంది. యూజర్లు తమ ఫోన్లలో వీటిని ఎనేబుల్ చేసి స్పామ్ కాల్స్ ను అడ్డుకోవచ్చని గూగుల్ చెబతోంది. వీటిని ఎలా ఎనేబుల్ చేయాలో చూద్దాం.

Advertisement

ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫోన్ యాప్ ఓపెన్ చేసి కుడివైపు పైన మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అందదులో కాల్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే కింద నిబంధనలకు అంగీకరిస్తున్నారా.. అని అడుగుతూ.. అగ్రీ బటన్ చూపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే కాలర్ ఆటీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్ ఫోన్ లో యాక్టివేట్ అవుతుంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel