Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Fake Calls: ఈ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే అస్సలే లిఫ్ట్ చేయొద్దు.. తెలుసా?

Fake Calls: ఇటీవల కాలంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం చాలా ఎక్కువైందది. చాలా మంది తెలియక ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ లను లిఫ్ట్ చేస్తున్నారు. కేవలం ఫోన్ ఎత్తినా సరే వారి అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. లేదా వారి సమాచారం హ్యాక్ కు గురవుతుంది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని పక్కదారి పట్టించి ఇళా కాల్స్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో టెలికాం శాఖ అలర్ట్ ప్రకటించింది. ... Read more

By Vinod Kumar

Published on: August 14, 2022 4:00 PM

Updated on: August 14, 2022 10:53 AM

---Advertisement---

Fake Calls: ఇటీవల కాలంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం చాలా ఎక్కువైందది. చాలా మంది తెలియక ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ లను లిఫ్ట్ చేస్తున్నారు. కేవలం ఫోన్ ఎత్తినా సరే వారి అకౌంట్ల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. లేదా వారి సమాచారం హ్యాక్ కు గురవుతుంది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని పక్కదారి పట్టించి ఇళా కాల్స్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో టెలికాం శాఖ అలర్ట్ ప్రకటించింది. వినియోగదారులు అలర్ట్ గా ఉండాలని సూచించింది.

Advertisement

+1, +9, +968, +44, +473, +809, +900 తో ప్రారంభం అయ్యే సంఖ్యల నుండి ఫోన్ కాల్స్ వచ్చినా లేదా వాట్సాప్ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దని తెలిపింది. నీకు తెలిసిన వ్యక్తి ఫొటోతో ఉన్న నెంబర్ నుంచి కాల్ వచ్చినా అస్సలే ఎత్తొద్దని టెలికాం శాఖం తెలిపింది. చాలా మంది కేటుగాళ్లు కాల్స్ చేసి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. దాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేస్తున్నారు. మహిళలను బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాగే వారి ఖాతాల్లో నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. అందుకే టెలికాం శాఖ ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే.. ఎత్తొద్దని తెలిపింది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ప్రజల్లో ఈ నంబర్లపై అవగాహన కల్పించింది.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.