Fact check : ప్రస్తుతం 5జీ స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తోంది. 5జీ ఫోన్ ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అయితే తక్కువ ధరలో ఫోన్ కావాలనుకునే వారు చాలా మంది ఇప్పటికే 4జీ మొబైళ్లను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ లో ఇప్పటికే చాలా 4జీ ఫోన్ లను మొబైల్ తయారీ సంస్థలు తీసుకుంటున్నాయి. దేశంలోని కొన్ని నగరాల్లో 5జీ నెట్ వర్క్ ఇటీవలే లాంచ్ అయింది. క్రమంగా విస్తరించనుంది.
ఈ తరుణంలో సోషల్ మీడియాలో ఓ మెసేజ్ విపరీతంగా వైరల్ అవుతోంది. 3జీ, 4జీ స్మార్ట్ ఫోన్ ల ఉత్పత్తిని నిలిపివేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచనలు జారీ చేసిందని ఆ పోస్ట్ సారాంశం. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇది నిజమేనా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏం చెప్పిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
4జీ, 5జీ ఫోన్ ల తయారీని నిలిపివేయాలని కంపెనీలకు భారత ప్రభుత్వం చెప్పిందన్న మెసేజ్ సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. దీంతో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. ఈ వైరల్ మమెసేజ్ అబద్ధమని వెల్లడించింది. ఫ్యాక్స్ చెక్ అకౌంట్ ద్వారా పీబీఐ ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. 4జీ, 3జీ ఫోన్ ల ఉత్పత్తిని ఆపేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచిందన్న ఆ మెసేజ్.. ఫేక్ అని తేల్చింది. కంపెనీలకు భారత ప్రభుత్వం అలాంటి మార్గ దర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది.
Read Also : 5G Jio Phone : బంపర్ ఆఫర్ ఇస్తున్న జియో… అతి తక్కువ ధరలో 5జీ ఫోన్ ?