Guppedantha Manasu: దగ్గరవుతున్న రిషి వసుధార.. కోపంతో రగిలిపోతున్న దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లీతెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార, రిషి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఈరోజు వసు, రిషి ఇద్దరు మాట్లాడకుండా ఉండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వస్తాడు. అప్పుడు గౌతమ్ రిషి చేతిలో ఉన్న బొమ్మలను చూసి బాగున్నాయి రా అని అనగానే వెంటనే రిషి వాటిని లాక్కొని ఇవి నా బొమ్మలు అని అంటాడు. గౌతమ్ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి మన ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాము దానికి నువ్వు హెల్ప్ చేయాలి అనడంతో సరే అని అంటాడు గౌతమ్.

Advertisement

మరొకవైపు ఇంట్లో అందరూ భోజనానికి కూర్చోగా అప్పుడు రిషి నేను వడ్డిస్తాను అని చెప్పి అందరికీ భోజనం వడ్డిస్తాడు. అప్పుడు రిషి, వసుకి వడ్డిస్తూ ఉండడంతో దేవయ్య అని అది చూసి కుళ్లుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జగతి తనకు వడ్డిస్తాడో లేదో అని సందేహపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి వెళ్లి ప్రేమతో వడ్డిస్తూ ఉండగా జగతి సంతోష పడుతూ ఉంటుంది.

అప్పుడు మహేంద్ర చాల్లే రిషి ఎక్కువ తినదు జగతి అని అనగా వెంటనే రిషి మీరు సైలెంట్ గా ఉండండి మేడం అసలే అనారోగ్యంతో ఉన్నారు అని అంటాడు. ఆ తర్వాత రిషి మహేంద్ర తో డాడ్ మీరు మేడంని తీసుకొని అలా పిక్నిక్ వెళ్లొచ్చు కదా అని అనగా మహేంద్ర సిగ్గుతో సరే అని అంటాడు. అది చూసి దేవయాని మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

ఆ తర్వాత అందరూ కలిసి బొమ్మల కొలువు గురించి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుకుంటూ ఉంటాడు.కానీ దేవయానికి అది నచ్చకపోవడంతో ముఖమంతా ఒకలాగా పెట్టుకుని ఉంటుంది. అప్పుడు రిషి, పెద్దమ్మ పర్మిషన్ లేకపోతే ఇంట్లో ఏ విషయం జరగదు అని అనగా, దేవయాని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు రిషి, పెద్దమ్మ ఒప్పుకున్నారు కాబట్టి మనం బొమ్మలకొలువు చేద్దామని అంటాడు

Advertisement

అప్పుడు దేవయాని మనసులో, మీరు నన్ను అడగలేదు నేను ఒప్పుకోలేదు మీకు మీరే అనేసుకొని, మీకు మీరే చేసేస్తున్నారు ఇలా ఉంటే నా ఇంటి పెద్ద పోస్ట్ డేంజర్ లో ఉన్నట్టే అని దేవయాని అనుకుంటుంది. అప్పుడు దేవయాని గౌతమ్ స్టోర్ రూమ్ లో బొమ్మలకు లో పెట్టడానికి స్టాండ్ ఉన్నది అది తీసుకువచ్చి ఇక్కడ పెట్టు అని చెబుతుంది.

రోజు ఉదయం అందరూ బొమ్మల కొలువు పండుగకు సెలబ్రేట్ చేయడానికి సిద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు మహేంద్ర గౌతమ్ సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దేవయాని ఏం చేయాలో తెలియక దాన్ని పై చీటికిమాటికి కోపం చూపిస్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి వసదార పద్ధతిగా లంగా వోని కట్టుకుని రావడం చూసి రిషి అనంతపడతాడు. జగతి మహేంద్రలు కూడా వసు ని చూసి మురిసిపోతూ ఉంటారు.

అప్పుడు అందరూ కలిసి బొమ్మలకు సంబంధించిన పనులు చేస్తూ ఉంటారు. ఇంతలో వసు ధరణి మేడమ్ కొన్ని చీరలు కావాలి ఎక్కడ ఉన్నాయి అని అనడంతో పైన రూమ్ లో ఉన్నాయి వెళ్లి తెచ్చుకో వసు అని అంటుంది. అప్పుడు దేవయాని కోప్పడి తనకు ఎలా తెలుస్తాయి దానిని నువ్వు వెళ్లి తీసుకుని రా అని అంటుంది. అప్పుడు వసు పర్లేదు మేడం నేను వెళ్లి తీసుకొచ్చుకుంటాను అని అంటుంది.

Advertisement

వసు బయలుదేరుతుండగా రిషి, ఒకదానివే ఎందుకు ఇక్కడ ఎవరినైనా తోడు తీసుకెళ్ళు అని అంటాడు. అప్పుడు వసు రిషి దగ్గరికి వచ్చి రిషి చేయ పట్టుకుని అందరి ముందు రిషి నీ పైకి తీసుకుని వెళుతుంది.ఆ దృశ్యాన్ని చూసిన అందరూ మనసులో ఆనందపడుతూ ఉండగా దేవయాని మొఖం మాత్రం రగిలిపోతూ ఉంటుంది. అది చూసి గౌతమ్, అలాగే మహేంద్ర దంపతులు ఆనంద పడుతూ ఉంటారు.

కానీ దేవయాని మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు వసుధార రిషి ఇద్దరు గదిలో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకోవడంతో మరింత సంతోష పడుతూ ఉంటారు. ఆ తరువాత దేవయాని ఇంట్లో వాళ్లకు పనులు చెబుతూ ఉండగా గౌతమ్ జగతితో మేడం దేవయాని కుళ్ళు బోతు బటాని కదా అని అనడంతో మహేంద్ర వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel