Viral Video: సాధారణంగా ఎవరైనా పోట్లాడుతుంటే చూసిన వాళ్లు.. వాళ్లనే ఆపే ప్రయత్నం చేస్తారు. వారెవరో తెలియకపోయినా ఇదేంటని ప్రశ్నిస్తూ ఆపే ప్రయత్నం చేస్తాం. కానీ కాలేజీ క్యాంటీన్ లోనే ఇద్దరు అమ్మాయిలో గొడవ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకుంటూ గట్టి గట్టిగా అరుచుకున్నారు. అయితే వారి గొడవను కళ్లారా చూస్తున్నారే తప్ప పక్కనున్న స్నేహితులు.. వాళ్లను ఆపే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఇంకా కొందరు నవ్వడం, మరికొందరు వీడియో తీయడం గమనార్హం. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగళూరులోని దయానంద సాగర్ అనే పేరుతో ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. తాజాగా ఆ కాలేజీ క్యాంటీన్ లో ఇద్దరు అమ్మాయిలు చిన్న విషయానికి గొడవ పడ్డారు. వెయిట్ మిషన్ పై బరువు చూస్కునే క్రమంలో చెలరేగిన ఈ వివాదం. మాటలు దాటి చేతల వరకూ వెళ్లింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. అయితే చుట్టూ చాలా మంది ఉన్నారు.
Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022
వారంతా వీరి గొడవను సినిమా చూసినట్లు చూస్తున్నారే తప్ప ఆపే ప్రయత్నంచేయలేరు. క్యాంటీన్ లో అంతమంది స్నేహితులు, తోటి విద్యార్థులు ఉన్నా వారిని విడదీసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మీరూ ఓ సారి ఈ వీడియో చూసేయండి.