Sugar And Romance: మధుమేహం ఉన్న వారు శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరని పలు పరిశోధనల్లో తేలింది. షుగర్ వ్యాధి నరాల ప్రసరణ, హార్మోన్లపై ప్రభావం చూపడంతో సెక్స్ ను అనుభూతి చెందలేరని పలు అధ్యయనాల్లో స్పష్టం అయింది. షుగర్ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపి దాంపత్య జీవితాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఎక్కువగా శృంగారం చేసే వారిలో షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నట్లు ఓ పరిశోధనలో తేలింది.
షుగర్ వల్ల నరాలు, రక్త ప్రసరణను ప్రభావితం అవుతాయి. దీంతో అంగస్తంభనలో సమస్యలు వస్తాయి. దీని కారణంగా టెస్టోస్టెరాన్ స్థాయులు కూడా తక్కువ అవుతాయి. అలాగే మహిళల్లోనూ మధుమేహం వల్ల కోరికలు తగ్గుతాయి. లైంగిక సమస్యలు తలెత్తుతాయి. జననేంద్రియ సమస్యలకి కూడా మధుమేహం కారణం అవుతుంది. దీని వల్ల లైంగిక కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. డయాబెటిస్-2 తో బాధపడుతున్న వారు శృంగారాన్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతారు.సెక్స్ లో పాల్గొనడం వల్ల పెద్ద మొత్తంలో శక్తి ఖర్చయి శరీరంలోని షుగర్ లెవల్స్ ఒకే సారి పడిపోతాయి.