Godfather: మూడు రాజధానులపై మెగాస్టార్ సెటైర్లు, జగన్ గురించేనా?

Godfather to take a dig at today politics
Godfather to take a dig at today politics

Godfather: దేశవ్యాప్తంగా ఏపీ మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వికేంద్రీకరణపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ వైఖరిని సీఎం జగన్ స్పష్టం చేశారు. తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పారు. అయితే ఈ టాపిక్ సినిమాల్లోకి డైలాగులు రూపంలోకి రాబోతుందా. ఒకప్పుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో పొలిటికల్ సెటైర్ సినిమాలు వచ్చాయి. అప్పటి రాజకీయ పరిస్థితులను సినిమాలో ఎండగడుతూ సీన్స్, డైలాగులు ఉండేవి. అవి చూసి అంతా నవ్వుకునేవారు. ఉడుక్కునేవారు. అంతకుమించి ముందుకు వెళ్లే వాళ్లు కాదు.

Advertisement

కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. సోషల్ మీడియాలో ప్రతీది రాజకీయం అయిపోతుంది. అలాంటిది ఓ లెస్బిటీ రాష్ట్ర పరిస్థితులపై, ముఖ్యమంత్రిపై మాట్లాడితే ఇంకేమన్నా ఉందా.. కానీ చిరు ఆ ధైర్యం చేయబోతున్నారు. మెగాస్టార్ హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం సెన్సార్ పూర్తి అయింది.

Advertisement