Karthika Deepam Sept 19 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నాకే షాక్ ఇస్తావ్ కదా నీకు ఎలా షాక్ ఇస్తానో చూడు మోనిత అని దీప అనుకుంటూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్, డ్రైవర్ శివ ఇద్దరూ కాస్త ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కార్తీక్,శివ పేరు మర్చిపోవడంతో వెంటనే శివ సర్ మీకు అన్ని మర్చిపోతారు కానీ ఆ వంటలక్క పేరు గుర్తుంటుంది కదా సార్ అని అనగా అవునయ్యా అన్ని మర్చిపోతాను కానీ ఆ వంటలక్క పేరు,ఆమెతో మాట్లాడిన మాటలు గుర్తుకుంటాయి అని అనడంతో వారి మాటలు కిటికీలో నుంచి వింటున్నావంటలక్క అదే బంధం అంటే డాక్టర్ బాబు అని అనుకుంటూ ఉంటుంది.
ఇక అప్పుడు శివ సార్ మేడం ఇంకా లేదు కదా మందు తాగుదామా అని అనడంతో సరే అంటాడు కార్తీక్. ఆ తర్వాత వారి మాటలు విన్న దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సౌందర్య ఆనంద్ రావ్ లు మోనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆనందరావు ఆ విషయం గురించి వదిలేయ్ అని అనడంతో లేదు ఇన్నేళ్లపాటు బిడ్డ మీద రాని మమకారం సడన్ గా ఎందుకు వచ్చింది.
బిడ్డను లక్ష్మణ్ వాళ్ళకి ఇచ్చి ఆస్తి మొత్తం రాసిచ్చింది అంతే బిడ్డను వదిలించుకోవాలనే కదా అని అంటుంది సౌందర్య. అప్పుడు గతంలో జరిగిన విషయాలను తలుచుకొని మోనిత మీద అనుమానం పడుతుంది సౌందర్య. ఆ తరువాత దీప చికెన్ పకోడీ చేస్తూ ఉంటుంది. ఇక దీప ని చూసిన శివ మందు తీసుకొని దీప వైపు చూడకుండా దాక్కొని వెళ్తూ ఉండగా దీప శివాని పిలిచి ప్రేమగా పలకరిస్తుంది.
నన్ను వంటలక్క దీపక్క అని పిలుస్తావు కదా నువ్వు నా తమ్ముడువి అంటూ శివను తన వైపుకు తిప్పుకుంటుంది వంటలక్క. తర్వాత మీకోసం కబాబు తీసుకొని వస్తాను డాక్టర్ బాబుకు చెప్పు అని చెప్పడంతో అక్కడి నుంచి శివ వెళ్ళిపోతాడు. మరొకవైపు వారణాసి ని సౌర్య నడిరోడ్డు పైకి పిలుచుకొని వచ్చి నిజం చెప్పు నువ్వు తాతయ్య వాళ్ళు పంపిస్తేనే వచ్చావు కదా అని అడుగుతుంది.
Karthika Deepam Sept 19 Today Episode : దీప ప్లాన్ తెలిసి మోనిత ఏం చేయబోతుందంటే?
అప్పుడు వారణాసి లేదు సౌర్య మ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చాను చెప్పినా కూడా సౌర్య వినిపించుకోకుండా వారనాసిపై కోప్పడుతుంది. ఆ తర్వాత లేదు సౌర్యమ్మ అని వారణాసి నచ్ చెప్పడంతో సరే అని అంటుంది శౌర్య. మరొకవైపు కార్తీక్ శివ ఇద్దరు మందు తాగుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దీప కార్తీక్ కోసం చికెన్ పకోడి తీసుకొని వస్తుంది.
అప్పుడు శివ మోనిత ప్రవర్తన దీపా ప్రవర్తనను కంపేర్ చేసి అడ్డ లెక్క చాలా మంచిది ఎలా అయినా ఈ విషయం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. తర్వాత కోసం దీప చికెన్ పకోడీ తీసుకొని రావడానికి కిచెన్ లోకి వెళ్ళగా అప్పుడు శివ అసలు విషయం తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తాడు. ఇంతలోనే శివ అక్కడికి దీపా తో మాట్లాడుతూ ఉండగా కార్తీక్ పిలవడంతో దీప శివ అక్కడికి వెళ్తారు. తర్వాత శివ కి ఇంట్లో నుంచి ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
అప్పుడు కార్తీక్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీప గతంలో జరిగిన విషయాలను తలుచుకొని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత బాధపడుతూ ఉండగానే కార్తీక్ మందు తాగి నిద్రలోకి జారుకుంటాడు. ఇంతలోనే శివ అక్కడికి రావడంతో ఇద్దరు కలిసి కార్తీక్ ని బెడ్ పై పడుకోబెడతారు. ఆ తర్వాత శివ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అప్పుడు దీప రూమ్ మొత్తం వెతికి కార్తీక్ ఆరోగ్యానికి సంబంధించిన రిపోర్ట్స్ ని తీసుకుంటుంది.
ఇక మరుసటి రోజు దీప కార్తీక్ కి కాఫీ ఇస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మోనిత, ఆనంద్ తీసుకొని వస్తుంది. అప్పుడు ఆనందిని చూడగానే దీప గతాన్ని గుర్తుకు తెచ్చుకొని మీరు ఒకసారి బాబుని ఎత్తుకొని డాక్టర్ బాబు అని అంటుంది. కార్తీక్ ఆనంద్ ని ఎత్తుకోగానే బాబు ఏడుపు ఆపేస్తాడు. అప్పుడు మోనిత, కార్తీక్ బాబుకి కొంచెం అటాచ్మెంట్ ఉంది కదా ఈ విషయం మర్చిపోయి తొందర పడ్డాను అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దీప కార్తీక్ బాబుని ఎత్తుకోగానే గతం గుర్తుకు వస్తుందా అని అంటుంది.
Read Also : Karthika Deepam serial Sep 17 Today Episode : కొడుకుని తీసుకెళ్లిన మోనిత.. సరికొత్త ప్లాన్ వేసిన దీప..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World