Horoscope : ఈరోజు అనగా సెప్టెంబర్ 16వ తేదీ నాడు పన్నెండు రాశుల వాళ్ల రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. మఖ్యంగా ప్రధాన గ్రహాలు అయిన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల రెండు రాశుల వాళ్లకు ఈరోజంతా లక్కే లక్కు అని తెలిపారు. అయితే ఈ రెండు రాశులు ఏంటి, వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తుల రాశి.. తుల రాశి వాళ్లు తమ తమ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పని తలపెట్టినా వెంటనే పూర్తి చేస్తారు. కాబట్టి మీరు ఏ పని ప్రారంభించాలన్నా ఆలస్యం చేయకుండా ఈరోజే మొదలు పెట్టండి. ఇది మీకు చాలా మంచి రోజు. సంకల్పసిద్ధి ఉంది. మిత్ర బలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు.
కుంభ రాశి.. కుంభ రాశి వాళ్లు మీ మీ రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కాబట్టి చాలా కష్టపడండి. దాని వల్ల మీకు పేరుతో పాటు డబ్బు కూడా వస్తుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులుక ఇది మంచి రోజు. ఈరోజు ఏ పని ప్రారంభించినా పేరు, ప్రఖ్యాతలు వస్తాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్యహృదయం పఠించడం మంచిది.