Guppedantha Manasu: రిషి ప్రేమ పరీక్షలో గెలిచిన వసు..సంతోషంలో జగతి దంపతులు..?

Guppedantha Manasu: తెలుగు బుల్లి తెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధారని రిషి బయటికి పిలుచుకొని వెళ్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు ఇద్దరూ బయట కలుస్తారు. అక్కడ ఇద్దరు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో అప్పుడు ఇద్దరూ ఒకరి వైపు ఒకరు అలా చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి, వసు ని కళ్ళు మూసుకో అని చెప్పి గులాబీ పువ్వులు ఇస్తాడు. ఆ పువ్వులు చూసిన వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవి చూసి ఆనందంతో మురిసిపోతూ ఉండగా ఇవి కేవలం పువ్వులు మాత్రమే కాదు వసుధారా నా ప్రశ్నలు కూడా వీటికి నువ్వు సమాధానాలు చెబితేనే నీకు దక్కుతాయి అంటూ ఒక్కొక్క ప్రశ్నను అడుగుతూ ఉంటాడు.

Advertisement

అలా వసుధార రిషిలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని రిషికి తెలియజేస్తూ రిషి దగ్గర నుంచి పువ్వులు అన్ని ఇప్పించుకుంటుంది. అప్పుడు వసు మాటలకు రిషి కూడా కాస్త ధైర్యం తెచ్చుకుని మాట్లాడుతాడు. వసుధర కూడా రిషి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ రిషి అనుకుంటున్నా మాటలను తప్పు అనే అని చెప్పి రిషి మనసును మారుస్తుంది. మీరు ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు సార్.

నాకు తెలుసు మీ విలువ, మీ విలువ తెలిసిన వాళ్ళు ఎవరూ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడరు సాక్షి మాటలు పట్టించుకోవద్దు అని చెప్తుంది. ఆ తరువాత వారిద్దరూ కలిసి ఒకచోట కూర్చుని పాప్ కార్న్ తింటూ ఉంటారు. అప్పుడు వసు పాప్ కార్న్ చాలా బాగుంది సార్ అని అంటుంది. ఆ తర్వాత వసు నీకోసం ఇంకొక పాప్ కార్న్ తీసుకొచ్చాను కార్ లో ఉంది తీసుకెళ్ళు అని అంటాడు.

మరొకవైపు జగతి దంపతులు గౌతమ్ వసు ఇంటి దగ్గర ఎదురుచూస్తూ ఉంటారు. ఇంతలోనే రిషి వసు దిగబెట్టి వెళ్తూ ఉంటాడు. ఇక అటుగా వసుధార ఒక్కటే నడుచుకుంటూ వస్తుండడంతో వారి ముగ్గురూ ఆశ్చర్యపోతారు. అప్పుడు గౌతమ్, వసుధార వచ్చి రాగానే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో జగతి అడగద్దు అని చెబుతుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి ముగ్గురు కలిసి నలుగురు కలిసి పాప్ కార్న్ తింటూ ఉంటారు.

Advertisement

అప్పుడు మహేంద్ర గౌతమ్ కావాలని వసుని ఆటపట్టించాలి అంటూ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతూ ఉండగా జగతి ఏం మాట్లాడకుండా ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది. మరోవైపు రిషి కార్లో వెళుతూ పక్క సీట్లో పాప్కాన్ పడి ఉండడం చూసి వసుధారతో అన్ని జ్ఞాపకాలు బాగుంటాయి అని అనుకుంటూ వెనకాల వైపు బ్యాగు ఉండడం చూసి అది వసు కి ఇవ్వాలి అని మళ్లీ రిటర్న్ బయలుదేరుతాడు.

ఇక మరోవైపు వసు, జగతి మహేంద్ర వాళ్ళ మాటలకు ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే రిషి వచ్చి తలుపు కొట్టడంతో పక్కింటి పిల్లాడు అని చెప్పి తలుపు తీయగా ఒకసారి రిషి కనిపించడంతో షాక్ అవుతుంది వసు. అప్పుడు వసు వెనకాల గౌతమ్, మహేంద్ర, జగతి ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు రిషి.

అప్పుడు గౌతమ్ మహేంద్ర కావాలని పాప్ కార్న్ గురించి తీస్తూ పాపం బాగుంది బాగుంది అని చెప్పడంతో ఏంటి డాడీ ఈ పాప్ కార్న్ గోల అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. దాంతో జగతి వాళ్ళు ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయిన రిషి వసుధారా కి బై వసుధార అని మెసేజ్ చేయగా అది రిప్లై ఇవ్వడానికి వసు ఇబ్బంది పడుతూ ఉంటుంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel