Mahalaxmi-Ravindar: ప్రేమ గుడ్డిది అంటారు కొంత మంది. ఎందుకంటే దానికి అందంతో, ఆస్తి పాస్తులతో సంబంధం లేదని దాని అర్థం. పెళ్లి చేసుకోవడానికి అందం చందం, ఆస్తి పాస్తులు కావాలి. పెళ్లి చేసుకునే ముందు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూస్తారు. కట్న కానుకల గురించి ముందే పక్కాగా మాట్లాడుకుంటారు. ఏమేం పెడతారు.. ఎప్పుడు పెడతారనేది ముందే నిర్ణయించుకుంటారు. కానీ ప్రేమ అనే భావన రావడానికి వీటితో పని లేదు. మనుషులు ఎలా ఉన్నా, వారికి ఆస్తి లేకపోయినా, అంతస్తుల్లో ఉండకపోయినా ప్రేమకు అవేవీ పట్టవు. ఎదుటి వారి మనసును మాత్రమే చూస్తారు. అది కల్మషం లేనిదైతే చాలు. వారిని ప్రాణంగా ప్రేమిస్తే చాలు అని అనుకుంటారు. దానిని మరోసారి నిజం చేసి చూపించింది ఈ జంట.
ఆయన తమిళ నిర్మాత. కపేరు రవిందర్ చంద్ర శేఖర, ఆమె పేరు వీజే మహాలక్ష్మీ. తను డైలీ సీరియళ్లలో నటిస్తుంది. ఆయనెమో ఆ సీరియళ్లను నిర్మిస్తుంటాడు. అయితే వీరిద్దరూ తాజాగా తిరుపతిలో పెళ్లి చేసుకుని అందరినీ షాక్ కు గురి చేశారు. ఎందుకంటే.. ఆమె బుట్ట బొమ్మలా అందంగా చక్కగా ఉంటుంది. ఆయనేమో చూడటానికి లావుగా ఉంటాడు. కానీ వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇంకేం శరీర ఆకృతులు, అందచందాలను వారి పట్టించుకోలేదు. బంధు మిత్రుల సమక్షంలో తిరుపతిలో వైభవంగా వివాహం చేసుకుని జీవితంలో ఒక్కటి అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.