Sudheer Chammak Chandra : సొంతగూటికి సుధీర్, చమ్మక్ చంద్ర.. భలే మంచి రోజు అంట.. మల్లెమాల ప్లాన్ మామూలుగా లేదుగా!

Sudheer Chammak Chandra : అందరూ ఊహించినట్టుగానే జరుగుతోంది. సొంత గూటికే మళ్లీ ఒక్కొక్కరుగా చేరుతున్నారు. ఇటీవలే గెటప్ శ్రీను అనూహ్యంగా జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు అదే బాటలో సుధీర్, చమ్మక్ చంద్ర కూడా వచ్చేసినట్టు గాసిప్ వినిపిస్తోంది. ఎందుకంటే.. జబర్దస్త్ కామెడీ షో నుంచి చాలామంది కంటెస్టెంట్‌లు బయటకు వెళ్లడం తెలిసిందే. ఇక మల్లెమాల గురించి కిరాక్ ఆర్‌పి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. అప్పట్లో దీనిపై ఆటో రాంప్రసాద్, హైపర్ ఆది కూడా గట్టిగానే స్పందించారు.

Sudheer Chammak Chandra Re Enter into Mallemala, Bhale Manchi Roju Latest Promo Released
Sudheer Chammak Chandra Re Enter into Mallemala, Bhale Manchi Roju Latest Promo Released

జబర్దస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్న గెటప్ శీను, సుడిగాలి సుధీర్ మల్లెమాలని వదిలేసి వెళ్లడంతో చాలా మంది జబర్దస్త్ షో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. మల్లెమాలలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వడం జరగదంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యనే గెటప్ శ్రీను జబర్దస్త్‌లో ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సుడిగాలి సుదీర్ కూడా ఎంట్రీ ఇవ్వాలని అతడి అభిమానులు కోరుకున్నారు. కానీ, సుధీర్ ఎంట్రీ ఇవ్వకపోవడంతో అభిమానకుల నిరాశే మిగిలింది.

Sudheer Chammak Chandra : మల్లెమాలకు సుధీర్, చంద్ర..

Sudheer Chammak Chandra Re Enter into Mallemala, Bhale Manchi Roju Latest Promo Released
Sudheer Chammak Chandra Re Enter into Mallemala, Bhale Manchi Roju Latest Promo Released

చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. అదిరింది, కామెడీ స్టార్ వంటి షోలో మెరిశాడు. సుధీర్ కూడా మా టీవీలో సూపర్ సింగర్ షోతో యాంకర్‌గా చేస్తున్నాడు. మల్లెమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ ఈటీవీ చానల్‌ని వదిలి పక్క ఛానల్‌కి వెళ్లిపోయాడు. ఈ మధ్య ఈటీవీ 27వ వార్షికోత్సవం అంటూ ఒక ఈవెంట్‌ని ప్లాన్ చేసింది మల్లేమాల.

Advertisement

ఈ మధ్యనే షో ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ‘భలే మంచి రోజు’ రాబోతున్న ఈవెంట్‌లో సుదీర్, చంద్రలు సందడి చేయనున్నారు. సుధీర్ అభిమానులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కేవలం ఈ ఒక్క షోకి అన్నట్టు తెలిసింది. ఈ షో ద్వారా సుదీర్ మల్లెమాలలో కంటిన్యూ అవుతారో లేదో చూడాలి.

Read Also : Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ఏమైంది.. లైగర్ బాయ్‌కు అందుకే నడుం పట్టేసిందా? అసలు మ్యాటర్ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel