Trishakti yantram: అన్ని దోషాలను తొలగించే త్రిశక్తి యంత్రం.. గుమ్మానికి తగిలించండి!

Trishakti yantram: త్రిశూలం, ఓం, స్వస్తిక్ సింబల్స్, శివుుడు, లక్ష్మీదేవి, దుర్గాదేవి ఫొటోలు ఉన్న త్రిశక్తి యంత్రం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ దీని గురించి తెలిసిన వాళ్లు మాత్రం కచ్చితంగా దీన్ని ఇంటి గుమ్మానికి తగిలించుకుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇంటి బయట ఈ త్రిశక్తి యంత్రాన్ని పెడితే ఏడాది పొడవునా ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం. వాస్తు ప్రకారం ఈ యంత్రాన్ని బయట ఉంచడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయి. నర దిష్టితో పాటు చెడు దృష్టి కూడా మనపై పడదు.

స్వస్తిక్, ఓం, త్రిశూలం కలిసి ఉన్న దాన్నే త్రిశక్తి యంత్రం అంటారు. దీన్ని ఇంటి ద్వారం వద్ద ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్తీ వస్తుంది. అలాగే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. త్రిశూలం గుర్తు వల్ల 3 రకాల దుఃఖాలను నాశనం చేస్తుంది. శివుని చేతిలో ఉండే ఈ త్రిశూలం సత్వ, రజ, తమో అనే మూడు గుణాలను సూచిస్తుంది. ఈ మూడింటి వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది.

Advertisement

కారం సింబల్ వల్ల నాదానికి చిహ్మం. ఓం అని పలుకుతున్నప్పుడు అ, ఉ, మ అనే మూడు అక్షరాలతో ఏర్పడుతుంది. ఈ మూడు పదాలు భూలోక, భవలోక, స్వర్గ లోకానికి ప్రతీక. సృష్టి ప్రారంభంలో ఓం అనే శబ్దం ప్రతిధ్వనించింది. అలాగే స్వస్తిక్ సింబల్ వల్ల అదృష్టం కల్గుతుంది. గోడలపై దీన్ని రాయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా నిలుస్తుందని నమ్ముతారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel