Bimbisara First Review : బింబిసార ఫస్ట్ రివ్యూ.. కళ్యాణ్ రామ్‌ కమ్ బ్యాక్.. కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ..!

Updated on: August 5, 2022

Bimbisara First Review : నందమూరి కళ్యాణ్ రామ్ రిస్క్ చేసి మరి నటించిన అతిపెద్ద ప్రాజెక్ట్ బింబిసార (Bimbisara Review) మూవీ. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. ఎన్టీఆర్ హార్ట్స్ హరి పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెసా (Catherine Tresa) జోడీలుగా నటించారు. చారిత్రక పాత్రను తీసుకుని దీనికి కల్పిత కథను అల్లి మరి తెరకెక్కించారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ మూవీ కోసం తాను ఎంత రిస్క్ చేశాడు అనేది కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు. ఇంతకీ మూవీ అంచనాలకు తగినట్టుగా ఉందా? నిజంగానే పాన్ ఇండియా మూవీకి తగినంత ఉందా? లేదో తెలియాలంటే ఓసారి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Bimbisara First Review : Kalyan Ram's Bimbisara Movie First Review in Telugu And Gets Public Talk
Bimbisara First Review : Kalyan Ram’s Bimbisara Movie First Review in Telugu And Gets Public Talk

నందమూరి కళ్యాణ్ రామ్ కేరీర్‌లోనే బిగెస్ట్ మూవీ ‘బింబిసార’ (Bimbisara). ఒక ఫాంటసీ మూవీని హ్యాండిల్ చేయడంలో మల్లిడి వశిష్ట్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ మూవీలో మ్యూజిక్ మాంత్రికుడు ఎంఎం కీరవాణీ ఎప్పటిలానే అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఎస్ఎస్ రాజమౌళి తరహాలో కీరవాణి తన మ్యూజిక్ రుచి చూపించారు. రూ. 37 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన బింబిసార (Bimbisara) మూవీ 500ఏళ్ల కాలం నాటి కథ ఆధారంగా రూపొందించారు.

ఈ మూవీలో టైమ్ ట్రావెల్ అనేది అద్భుతంగా రూపొందించారు. ఈ మూవీ ఫస్ట్ రివ్యూను ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యులు ఉమైర్ సంధు ట్విట్టర్ ద్వారా అందించారు. విజువల్ పరంగానే కాదు.. స్టోరీలోనూ దమ్మున్న మూవీగా అద్భుతంగా వచ్చిందని ఆయన చెప్పారు. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం చక్రవర్తిగా నటించిన నందమూరి కళ్యాణ్ రామ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇరగదీశాడని చెప్పుకొచ్చాడు. మూవీ రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ వశిస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Advertisement
Movie Name : Bimbisara (2022)
Director :  మల్లిడి వశిస్ట్
Cast : నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెసా
Producers :హరికృష్ణ కె
Music : ఎమ్.ఎమ్ కీరవాణి
Release Date :5 ఆగస్టు 2022

Bimbisara First Review : బింబిసార అసలు స్టోరీ ఇదే :

అసలు బింబిసార స్టోరీ ఏంటి అనేది మూడు ముక్కల్లో తేల్చేశారు. త్రిగర్తల సామ్రజ్యాధినేత బింబిసారుడు పాత్రలో కళ్యాణ్ రామ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. క్రీస్తు పూర్వం 500 ఏళ్ల నాటి గొప్ప రాజుకు సంబంధించిన కథ ఇది. ఆ కాలంలో అతనికి ఎదురులేదు. కాల ప్రవాహంలో బింబిసారుడు కలిసిపోతాడు. ఆ తర్వాత అదే బింబిసారుడు డిజిటల్ కలియుగంలో మళ్లీ పుడుతాడు. అయితే అతని గతం వెంటాడుతూ ఉంటుంది. అలా కాలంతో పాటు వెనక్కి ప్రయాణిస్తాడు. ప్రస్తుత ప్రపంచంలోకి వచ్చి మరి తనకు సంబంధించిన నిధిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు బింబిసారుడు.

Bimbisara First Review _ Kalyan Ram's Bimbisara Movie First Review in Telugu And Gets Public Talk
Bimbisara First Review _ Kalyan Ram’s Bimbisara Movie First Review in Telugu And Gets Public Talk

వరుస ప్లాప్ లతో సతమతమైన కళ్యాణ్ రామ్‌కు ఇదో టఫ్ టైం అనే చెప్పాలి. ఎప్పటినుంచి మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్‌కు ఇదో కొత్త మలుపు అని చెప్పవచ్చు. బింబిసార రోల్ అత్యుద్భుమని చెప్పాలి. కానీ, మొదటి భాగంలోనే బింబిసార రోల్ ఎండ్ అయిపోతుంది. సాటి ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. సెకండాఫ్ మాత్రం బింబిసార అద్భుతంగా కథను మలుపు తిప్పాడు దర్శకుడు. కొత్తగా అనిపిస్తుంది. బింబిసారలో మరో కోణాన్ని చూపించాడు. ఇదే సినిమాకు పెద్ద హైలెట్ అని చెప్పాలి. హాఫ్ పార్ట్ గ్రాఫిక్స్ తోనే నడుస్తుంది. గ్రాఫిక్స్ పరంగా విజువలైజేషన్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఆడియోన్స్ సులభంగా కనెక్ట్ అయ్యేలా దర్శకుడు పాత్రలకు అవకాశం ఇచ్చాడు.

కళ్యాణ్ రామ్ నటన ప్లస్ పాయింట్.. కష్టం కనిపించింది : 

Bimbisara First Review : Kalyan Ram's Bimbisara Movie First Review in Telugu And Gets Public Talk
Bimbisara First Review : Kalyan Ram’s Bimbisara Movie First Review in Telugu And Gets Public Talk

ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటన అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ఈ మూవీ కోసం కళ్యాణ్ రామ్ పడిన కష్టం అంతాఇంతా కాదు.. తనను తాను పూర్తిగా మార్చేసుకున్నాడు. సాధారణ లుక్ నుంచి స్టైలిష్ లుక్ లోకి మారడం నిజంగా సాహసమనే చెప్పాలి. మిగతా నటనీటడుల విషయానికి వస్తే. కేథరిన్, సంయుకత్త మీనన్ తమకు తగిన పాత్రలో నటించారు. మిగతా తారాగణం కూడా బాగానే నటించారు. మొత్తానికి చూస్తే.. బింబిసార మూవీ గ్రాఫిక్స్ పరంగా బెస్ట్ అని చెప్పవచ్చు. అలాగే స్టైలిష్, థ్రిల్లింగ్ హిస్టరీ అండ్ రొమాంటిక్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Advertisement

ఇప్పటివరకూ కళ్యాణ్ రామ్ నటించిన మూవీల్లో కన్నా బింబిసార మూవీకి సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది. యాక్షన్ సీన్స్ మాత్రం పిచ్చెక్కించేలా ఉన్నాయి. ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ నటించిన ఆధిత్య 369 మూవీని గుర్తు చేసేలా ఉంది. అప్పట్లో బాలయ్య టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నట్టుగానే ఇప్పుడు కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య మాదిరిగానే నేటి టైమ్ ట్రావెల్ మూవీతో వచ్చాడు. నందమూరి కుటుంబం నుంచి మరో టైమ్ ట్రావెల్ బెస్ట్ మూవీగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆగస్టు 5న కళ్యాణ్ రామ్ బింబిసార (Bimbisara Movie Release 2022) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ మొత్తం నాలుగు పార్టులుగా రానుంది. అందులో ఫస్ట్ పార్ట్ ఈ రోజు రిలీజ్ అవుతోంది.

Read Also : Bimbisara Pre Release Event : బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ సందడి.. నందమూరి ఫ్యాన్స్‏కు డబుల్ ట్రీట్..!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel