Man fall in hot sambar: మరుగుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. చికిత్సపొందుతూ మృతి!

Man fall in hot sambar: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గ్రామ దేవత ఉత్సవాల సందర్భంగా ఊరంతా పండుగు చేసుకుంటుండగా… ఆ వ్యక్తి మాత్రం ఫుల్ గా మద్యం తాగి ఆ ఇంట్లో తీవ్ర విషాధాన్ని నింపాడు. ఉడుకుతున్న సంబారులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన తమిళనాడులో జరిగింది. మధురైలోని పలంగానట్టిలో గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్థులు వైభవంగా నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తుండగా గ్రామానికి చెందిన ముత్తు కుమార్ అనే వ్యక్తి ఫుల్ గా మద్యం తాగి తూలుతూ అక్కడికి వ్చచాడు. అన్నదానానికి భారీ పాత్రలో సాంబారు చేస్తుండగా.. గోడ అనుకుని దానిపై కూర్యోబోయి అందులో పడిపోయాడు. వెంటనే గమనించిన గ్రామస్థులు అతడిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముత్తుకుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యంలో మృతి చెందాడు. ముత్తు కుమార్ ను రక్షించే క్రమంలో పలువురు గ్రామస్థులు సైతం సాంబార్ మీద పడి గాయపడ్డారు. దీంతో పండుగ రోజు పలంగానట్టి గ్రామంలో విషాధం నెలకొంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel