Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహం వెంకట చైతన్యతో జరిగి ఏడాదిన్నర అవుతుంది. 2020 డిసెంబర్ 9న వీరిద్దరి వివాహం జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఘనంగా జరిగింది. ఫ్యామిలీ అందరూ పాల్గొన్న ఈ వివాహ వేడుక ఐదు రోజుల పాటు ఘనంగా జరిగింది. ఈ వివాహం నేషనల్ వైడ్ న్యూస్ వైరల్ అయింది. ఇకపోతే నిహారిక వివాహమయ్యాక తన భర్త బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు.

జూలై 26 వెంకట్ చైతన్య బర్త్‌డే కాగా.. నిహారిక దగ్గరుండి మరి భర్త బర్త్‌డేను ఘనంగా జరిపించారు. ఈ బర్త్‌డే పార్టీలో నిహారిక రెడ్ ఫ్రాక్‌లో సూపర్ స్టైలిష్‌గా మెరిసిపోతున్నారు. ఇక భర్త వెంకట చైతన్య బర్త్‌డే పార్టీలో నిహారిక స్నేహితులతో కలిసి పార్టీని బాగా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్‌తో ఆమె ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక తన భర్తకు స్పెషల్‌గా విషెస్ తెలిపింది. తన భర్త తనని ఎలా భరిస్తున్నాడో చెబుతూ హ్యాపీ బర్త్‌డే చై.. మై క్యూటెస్ట్ కుకుంబర్.. నేను ఎంత పిచ్చిపిచ్చిగా అల్లరి చేసిన కామ్‌గా ఉంటావ్ థాంక్యూ.

ఐలవ్ యూ బేబీ అంటూ నిహారిక తన భర్తకు బర్త్‌డే విషెస్ తెలిపింది. నిహారిక వేసిన పోస్టుకు వెంకట చైతన్య (Venkat Chaitanya Birthday) థాంక్యూ లవ్ అని కామెంట్ పెట్టాడు. ఇక వీరి పోస్టులు, కామెంట్లు చూసిన యూట్యూబర్ నిఖిల్ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే.. సమంత స్టైలిష్ ప్రితమ్ జుకల్కర్ కూడా చైతన్యకు బర్త్‌డే విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్‌డే టు.. నిహ క్యూటెస్ట్ కుకుంబర్ అంటూ చైతన్యకు విషెస్ తెలిపారు. మరోవైపు.. నిహారిక తల్లి కాబోతుదంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
తన ప్రెగ్నెంట్ అనే విషయాన్ని స్నేహితులతో షేర్ చేసుకుందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు.. మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక అత్తగారింటికి సారె కూడా పంపించారంటూ జోరుగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిహారిక భర్త వెంకట చైతన్య పుట్టినరోజు కావడంతో సెలబ్రేషన్స్ జోరు మరింత పెంచినట్టు తెలుస్తోంది. అందుకే నిహారిక తన భర్త బర్తడే సెలబ్రేషన్స్ స్పెషల్‌గా చేయడానికి కారణం ఇదే కావొచ్చునని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Read Also : Niharika Konidela : తల్లి కాబోతున్న నిహారిక.. మేం ముగ్గురం అంటున్న మెగా డాటర్..!