Gulabi Aankhen Kid : ఈ బాలుడు గొంతులో పలికే ఆ పాట.. ఎంతో మధురంగా వినిపిస్తోంది. పాట విన్నాక ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. అంత తియ్యగా పాడుతున్నాడు. తన చిన్నతనంలో స్కూళ్లో పాడిన ‘గులాబీ ఆంఖే’ అనే పాట బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడా బుడ్డోడు కొంచెం పెద్దవాడు అయ్యాడుగా.. అందుకే ప్రోగా పాడేస్తున్నాడు. కీబోర్డు వాయిస్తున్నాడు. కీబోర్డు వాయిస్తూ ‘మేరే మెహబూబ్ ఖాయమత్ హోగీ’ అంటూ కిశోర్‌కుమార్‌లా పాడేశాడు.

ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీశ్ శరణ్ ట్విటర్‌లో షేర్ చేసారు. ‘మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే’ మూవీలోని హిట్‌సాంగ్‌ను తన మధురమైన స్వరంతో పాడుతూ కీబోర్డును ప్లే చేశాడు ఆ బాలుడు.. ఆహా.. ఎంతో మధురమైన బాలుడి స్వరంలో ఆ పాటను వింటుంటే నిజంగానే గాల్లో తేలినట్టుగా అనిపించేలా ఉంది. ఈ వీడియోకు అవనీశ్ శరణ్ ‘మేడ్ మై డే’ అని క్యాప్షన్ పెట్టారు.
Made My Day.❤️ pic.twitter.com/SMKj5ZfyHO
Advertisement— Awanish Sharan (@AwanishSharan) July 8, 2022
చిన్నతనంలో నుంచి బాలుడి పాటలో చాలా మెచ్యూరిటీ వచ్చిందని అంటున్నారు. లవ్లీ సింగర్ అని నెటిజన్ కామెంట్ చేయగా.. వాహ్.. సూపర్ బుడ్డోడా అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
Read Also : SBI : ఎస్బీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రెండు వారాల్లోనూ బ్యాంకు సేవలు?