...

Rashmika mandanna: రష్మిక కుక్కకు కూడా ఫ్లైట్ టికెట్స్ కావాలట.. వామ్మో!

Rashmika mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి, ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ.. దూసుకెళ్తున్న ఈమె పుష్ప చిత్రంతో మరింత స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ సినిమా తర్వాత నుంచి ఈమెకు అవకాశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే రష్మికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల రష్మిక తన సినిమా షూటింగ్ లో బాగంగా నిర్మాతలకు పలు కండిషన్లు పెట్టి ఇబ్బంది పెట్టిందట. షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మరో ప్రాంతానికి రష్మిక ప్రయాణించాల్సి ఉండగా… తనతో పాటు తన పెంపుడు కుక్కకు కూడా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలని డిమాండ్ చేసిందట. ఇలా బోలెడన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

Advertisement

అయితే ఈ వార్తలను చూసిన రష్మిక స్పందించింది. ఇందుకు సంబంధించిన వార్తల స్క్రీన్ షాట్ లను ట్విట్టర్ లో షేర్ చేస్తూ… సదరు వార్తలను కొట్టిపారేసింది. ఈ మేరకు రష్మిక ట్వీట్ చేస్తూ… హే.. ఇలాంటి రూమర్స్ ఎలా సృష్టిస్తారో అర్థం కాదు. ఆరా (రష్మిక పెంపుడు కుక్క పేరు) నాతో కలిసి ప్రయాణించాలని మీకు ఉన్నప్పటికీ… తనకు మాత్రం నాతో ట్రావెల్ చేయడం అస్సలే ఇష్టం ఉండదు. తన హైదరాబాద్ లోనే చాలా హ్యాపీగా ఉంటుందంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన రోజంతా నవ్వుతూనే ఉన్నానంటూ తెలిపింది.

Advertisement

Advertisement
Advertisement