Devatha june 22 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి స్కూల్లో ఎమోషనల్ అవుతూ ఆదిత్యకు మాధవ గురించి చెబుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో దేవి మాధవ కనిపించలేదు అని ఎమోషనల్ అవుతూ ఉండడంతో ఆదిత్య దేవి ఏడుపుని చూసి తట్టుకోలేక ఎలా అయినా మాధవను తీసుకు వస్తాను అని మాట ఇస్తాడు. అందుకు దేవి సరే అని లోపలి కి వెళ్లిపోతుంది. కానీ ఆదిత్య మాత్రం సొంత తండ్రిని నేనే అని చెప్పలేను అంటూ బాధపడుతూ ఉంటాడు.
మరొకవైపు మాధవ కనిపించకపోయేసరికి ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. పిల్లలు మాధవ కోసం ఏడుస్తూ ఉండగా అప్పుడు రాధ,మాధవ గురించి ఆలోచిస్తూ ఏదో పెద్ద ప్లాన్ వేసాడు అందుకే ఇలా ఇంటి నుంచి వెళ్లిపోయాడు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు పిల్లలను భోజనం చేయమని పిలవగా వెంటనే జానకి రాధ పై కోప్పడుతుంది.
మరోవైపు ఆదిత్య దేవి అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. మాధవ ఎక్కడికి వెళ్లి ఉంటాడు ఎలా వెతికాను ఎక్కడ ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు స్కూల్లో ఫాదర్స్ డే సందర్భంగా వేడుకలు జరుగుతూ ఉండడంతో ఆ వేడుకకు చీఫ్ గెస్ట్ గా అదిత్య వస్తాడు. ఆ తర్వాత వేడుకల్లో రాధ కనిపించడంతో రాధా తో కలిసి మాట్లాడతాడు ఆదిత్య.
అప్పుడు రాధ,మాధవ ఇంట్లో నుంచి వెళ్లిపోయినందుకు దేవి చాలా బాధపడుతుంది. అప్పుడు ఆదిత్య, రాధకు దైర్యం చెబుతూ నువ్వేమి భయపడకు నేనే దేవి అసలు తండ్రి తాను అని చెప్పెస్తాను అని అంటాడు. ఆ తర్వాత స్కూల్ లో ఫంక్షన్ మొదలవగా పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి తమ తల్లిదండ్రుల గురించి చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే దేవి అక్కడికి వెళ్ళి మాధవ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ తన తండ్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అంటూ ఉండగా అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇస్తాడు మాధవ. అప్పుడు మాధవ ని చూసిన దేవి పరుగున వెళ్లి మాధవను ఒక్కసారిగా హత్తుకుంటుంది.
ఫాదర్స్ డే సందర్భంగా మాధవకు గిఫ్ట్ కూడా ఇస్తుంది. అప్పుడు మాధవ తన చేతి పై దేవి అన్న పేరు పచ్చబొట్టు పొడిపించుకోవడం చూసి ఆదిత్య, రాధ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు మాధవ మరింత రెచ్చిపోయి ఇది నా ఫ్యామిలీ అంటూ అందరికీ పరిచయం చేస్
Read Also : Devatha: ఆదిత్య ని తలుచుకొని ఎమోషనల్ అవుతున్న రాధ.. దేవికి దగ్గరవుతున్న ఆదిత్య..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World