Guppedantha Manasu june 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు ఇద్దరు ఒక చోట కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో వసు నేను ల్యాబ్ లో మాట్లాడిన మాటలు నా మనసులో నుంచి వచ్చాయి సార్, మీరు అంటే నాకు ఇష్టం, మీరు లేకపోతే నేను బ్రతకలేను.ఐ లవ్ యు అని అనడంతో రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు.ఆ తర్వాత రిషి వసు చెంప చెల్లు మనిపిస్తాడు.
ఏమంటున్నావ్ ఐలవ్యూ నా, మరి ఆరోజు నేను ఐలవ్యూ చెబితే క్లారిటీ లేదు భయమేస్తుంది అన్నావ్. మరి ఈ రోజు నీకు కొత్తగా ఏమి క్లారిటీ వచ్చింది అంటూ వసు పై కోప్పడతాడు రిషి. నేను ఆరోజు ఎలాగ ఉన్నారు ఇప్పుడు కూడా అదే విధంగానే ఉన్నాను ఆరోజు నువ్వు నా మనసును ముక్కలు చేసి వెళ్లిపోయావు అని అనడం తో బాధపడుతూ ఉంటుంది.
నువ్వు నా ప్రేమను రిజెక్ట్ తీసిన తర్వాత ప్రతిరోజు, ప్రతిక్షణం నేను ఎంత నరకం అనుభవించాను నీకేం తెలుసు అని అనడంతో వసు ఎమోషనల్ అవుతుంది. అదంతా కూడా వసు కలగంటుంది. నిద్రలో ఉలిక్కిపడి లేచిన వసు నిజంగానే నేను రిషి సార్ కీ ప్రపోజ్ చేస్తే ఈ విధంగానే రియాక్ట్ అవుతారా అనుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది.
ఇక ఆ తరువాత వసు రిషి కోసం రెస్టారెంట్ దగ్గర ఎదురు చూస్తూ ఉండగా ఆ హోటల్ మేనేజర్ ఈ మధ్య వసులో చాలా మార్పు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే గౌతమ్, రిషి ఇద్దరూ రెస్టారెంట్ కి వస్తారు. అప్పుడు రిషి,గౌతం నువ్వు వెళ్ళు నేను రాను అని అంటూ ఉండగా ఇంతలోనే ఆ రెస్టారెంట్ మేనేజర్ రిషి దగ్గరికి వచ్చి మీత వసు గురించి మాట్లాడాలి.
ఆ తర్వాత రెస్టారెంట్ మేనేజర్, గౌతమ్,రిషి,వసు గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వస్తుంది.అప్పుడు వసు ని చూసిన రిషి,వసు మనస్తత్వం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు తనను అంచనా వేయడం చాలా కష్టం అని అంటాడు. అందరూ బయటికి బాధ ఉన్నప్పటికీ లోపల భయపడుతూ ఉంటారు అని వసుని ఉద్దేశించి మాట్లాడతాడు.
ఆ తర్వాత మేనేజర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో వసు ఆర్డర్ తీసుకొని వారికి కాపీ తీసుకుని వస్తుంది. కానీ రిషి కాఫీ తాగకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గౌతం రిషి ఇద్దరూ కలిసి కారులో వెళ్తూ పన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రిషి మళ్లీ రెస్టారెంట్ కి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో వేరే వ్యక్తిని చూసి రిషి అనుకొని భ్రమ పడుతుంది.
కానీ అప్పుడు రిషి స్వయంగా వచ్చినా కూడా వసు రిషి కాదు అన్న విధంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు నిజంగానే రిషి వచ్చాడు అని తెలుసుకొని వెళ్లి కాఫీ తెచ్చి లోపే అక్కడ ఒక పేపర్లో అన్నింటికీ థాంక్స్ అని చెప్పి డబ్బులు పెట్టి వెళ్ళిపోతాడు. ఆ తరువాత ఇంట్లో వసు, రిషి అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World