Virata Parvam : విరాట పర్వం.. జూన్ 17న థియేటర్లలోకి వచ్చేస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం మూవీపై రిలీజ్ కు ముందే భారీగా అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ వేణు ఉడుగుల తెరకెక్కించిన విరాటపర్వం మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మంచి క్రేజ్ సంపాదించాయి. విరాటపర్వం మూవీ క్రేజ్ పెరిగిపోయింది. 90’లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన నక్సలిజం నేపథ్యంలో వస్తున్న విరాట పర్వం మూవీ జూన్ 17న థియేటర్లలోకి వచ్చేస్తోంది. మూవీ రిలీజ్ ముందే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. హైదరాబాద్‌లో విరాటపర్వం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. బర్త్ ఆఫ్ వెన్నెల వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో చూసిన ప్రతిఒక్కరిలో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
విరాట పర్వం మూవీలో కీ రోల్ వెన్నెల చుట్టే తిరుగుతుంది. వెన్నెల పుట్టుకకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది. నాలుగు నిమిషాల నిడివి గల వీడియోలో ‘కారణం ఎప్పుడూ ఉంటుంది.. అది ఎల్లప్పుడూ సహేతుకం కాదు’ అంటూ కారల్ మార్క్స్ కొటేషన్‌తో బిగిన్ అవుతుంది. 1973 తెలంగాణ రూరల్, ఆంధ్రప్రదేశ్ సమీపంలోని అడవి.. రాత్రి భారీ వర్షంలో ఓ ట్రాక్టర్‌లో గర్భిణీ పురిటినొప్పులతో బాధపడుతుంది. అప్పుడే నక్సల్స్, పోలీసులకు మధ్య కాల్పులు జరుగుతుంటాయి.. ట్రాక్టర్ రోడ్డుపైనే డ్రైవర్ ఆపేస్తాడు. గర్భిణి అరుపులు విన్న నక్సలైట్ నివేధా పేతురాజ్ అక్కడికి వస్తుంది.
Virata Parvam : ‘బర్త్ ఆఫ్ వెన్నెల’ వీడియో చూశారా..
తాను డాక్టర్ అంటూ గర్భిణికి ప్రసవం చేస్తుంది. పండంటి ఆడపిల్లను చేతుల్లోకి తీసుకుని తండ్రికి ఇస్తుంది. కూతురిని, భార్యను కాపాడినందుకు బిడ్డకు పేరు పెట్టాలని అడుగుతారు. చందమామను చూపిస్తూ.. ఆ పాపకు వెన్నెలగా పేరు పెడుతుంది. లాల్ సలామ్ అని పిడికిలి బిగించగానే.. ఆమె తలలోకి బుల్లెట్ దూసుకుపోయి చనిపోతుంది. ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలను తీస్తుంది. కానీ, అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది. నేను వెన్నెల.. ఇది నా కథ అంటూ సాయి పల్లవి డైలాగ్తో ఈ వీడియో ఎండ్ అవుతుంది.
Read Also : Prabhas New Look : ప్రభాస్ స్టైలీష్ లుక్స్.. ట్రోలర్లకు దిమ్మతిరిగేలా షాకిచ్చిన డార్లింగ్.. వీడియో వైరల్!
Tufan9 Telugu News providing All Categories of Content from all over world