Tik tok : మనకూ టిక్ టాక్ రాబోతుందట.. ఇది నిజమేనా.. ఎప్పుడొస్తుంది మరి!

Tik tok : ప్రముఖ షార్ట్ వీడియో మేనేజింగ్ యాప్ టిక్ టాక్ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే చైనా తర్వాత టిక్ టాక్ కు అత్యధిక యూజర్లు ఉన్నది భారతదేశంలోనే. లాంట్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాలకు అతి వేగంగా పాకేసిన ఈ యాప్ ద్వారా… మామూలు ప్రజలు కూడా చాలా ఫేమస్ అయ్యారు. డ్యాన్స్, కామెడీ.. ఇలా పలు రకాల వీడియోలు చేసి స్టార్ లు గా మారారు. అయితే దీని వల్ల బోల్డ్ కంటెంట్ కూడా ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఈ యాప్ నే వాడుతున్నట్లు తెలిసింది.

Advertisement
Tik tok
Tik tok

అయితే కొన్ని కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం మన దేశంలో టిక్ టాక్ ని నిషేధించింది. అయితే తాజాగా టిక్ టాక్ ను ఇండియాకు తీసుకొచ్చేందుకు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ కు చెందిన హిరనందిని గ్రూపుతో భాగస్వామ్యం ఏర్పరుచుకొని ఇండియాలో టిక్ టాక్ ను మళ్లీ లాంచ్ చేయాలని బైట్ డ్యాన్స్ ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ కంపెనీ భాగస్వామ్యంతో భారత్ లోనే డేటా స్టోర్ అయ్యేలా చర్యలు తీస్కొని టిక్ టాక్ ని రీలాంచ్ చేయాసని ప్లాన్ చేస్తోంది.

Advertisement

అయితే డేటా స్టోరేజీని ఇండియాలోనే భద్రపరిచేలా మార్పులు చేసుకుంటే అనుమతి ఇచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. అయితే హిరనందిని అనే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంస్థతో ఒప్పందం చేసుకొని డేటా ఇక్కడే స్టోర్ చేయాలని బైట్ డ్యాన్స్ ప్రయత్నిస్తోంది. అయితే ప్రభుత్వం అనుమతి లభిస్తుందా లేదా అన్ని చూడాల్సిందే.
Read Also :   Vikram Movie Review : ‘విక్రమ్‘ ఫస్ట్ రివ్యూ ఇదిగో.. రెస్పాన్స్ సూపర్.. బ్లాక్‌బస్టరే..! 

Advertisement
Advertisement