Samantha : టీవీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ షోలోకి సమంత ఎంట్రీ ఇవ్వబోతోంది. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో బిగ్ బాస్ టీం సమంతను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ ను మూడు సీజన్లుగా కింగ్ నాగార్జునే హోస్టుగా చేస్తున్నాడు. ఈసారి బిగ్ బాస్ 6 సీజన్ మాత్రం తాను హోస్టుగా చేయనని చెప్పేశాడట.. దాంతో బిగ్ బాస్ టీం సమంతను రంగంలోకి దించేందుకు అంతా సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందులోనూ బిగ్ బాగ్ 5 సీజన్లు టీవీలో ప్రసారం చేసిన బిగ్ బాస్ టీం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ పేరుతో 24 గంటలు అంటూ డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారం చేసింది. అయితే దీనికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. దాంతో బిగ్ బాస్ 6 సీజన్‌లో మళ్లీ మంచి రెస్పాన్స్ తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీం ప్రయత్నాలు చేస్తోంది. అతి త్వరలో బిగ్ బాస్ 6 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో సమంతతో హోస్టుగా చేయించి మళ్లీ బిగ్ బాస్ ట్రాక్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సమంత బిగ్ బాస్ హోస్టుగా రానుందా? లేదా ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. మరోవైపు సమంత, విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి మూవీలో నటిస్తోంది. ఈ చిత్రానికి శివ నిర్మాణ దర్శకత్వాన్ని వ్యవహరిస్తున్నాడు. ప్రేమకథ జానర్‌లో వస్తున్న మూవీకి ఖుషి టైటిల్‌ని ఖరారు చేశారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కాశ్మీర్‌లో జరుగుతోంది. హేషమ్ అబ్దుల్ వహబ్ మలయాళీ సంగీతం అందిస్తున్నారు.
Read Also : Sudigali Sudheer : సూపర్ సింగర్ జూనియర్ కోసం కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుడిగాలి సుదీర్?
Tufan9 Telugu News providing All Categories of Content from all over world