Guppedantha Manasu june 2 Today Episode : తెలుగు బుల్లితెర పై బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిజం తెలుసుకున్న జగతి మహేంద్ర తో మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకొని వెళుతుంది..
ఈరోజు ఎపిసోడ్ లో రిషి క్లాస్ చెబుతూ ఉండగా ఇంతలో వసు అక్కడికి వచ్చి లోపలికి రావచ్చా అని పర్మిషన్ అడగగా అప్పుడు రిషి కాలేజీ టైమింగ్స్ పాటించాలి అన్నింటికీ లెక్కలు ఉంటాయి అని బోర్డు పై ఒక లెక్కలు రాసి దానిని సాల్వ్ చేయమని ఈరోజు క్లాస్ అయిపోయింది అని చెప్పి స్టూడెంట్స్ ని పంపించేస్తాడు.

వసు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రిషి, వసు కూర్చునే ప్లేస్ లో కూర్చొని వసు తనతో మాట్లాడుతుట్టుగా ఊహించుకుంటాడు. మరొకవైపు జగతి, మహేంద్రకు అసలు విషయాన్ని చెప్పడంతో మహేంద్ర షాక్ అవుతాడు. అప్పుడు వారిద్దరూ రిషి, వసు ల గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో మహేంద్ర ఇన్ని రోజులు వసు, రిషి కి దగ్గరగా ఉండడానికి కారణం గురుదక్షిణ అని అనగానే ఆ మాట విన్న జగతి వెంటనే ఏంటో అన్నావు చెప్పు అంటూ మహేంద్ర ను నిలదీస్తుంది.
అప్పుడు మహేంద్ర అసలు విషయాన్ని చెప్పడంతో జగతి షాక్ అవుతుంది. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ విషయాన్ని గౌతమ్ విని కాలేజీ దగ్గరికి వెళ్తాడు. మరోవైపు సాక్షి జరిగిన విషయాన్ని తలచుకొని ఆనందంగా ఉంటుంది. రిషి కి అడ్డుగా ఉన్న ఆ వసు అడ్డు తొలగిపోయింది అని ఆనందపడుతూ ఉంటుంది.
మరొకవైపు రిషి ఒంటరిగా క్లాస్ లో కూర్చుని ఆలోచిస్తూ వసు జ్ఞాపకాలు గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు వసుధార అని బోర్డుపై పేరు కూడా రాస్తాడు. మరొక వైపు వసు,రిషి సార్ తనతో ఎందుకు మాట్లాడలేదు తెలుసుకుంటాను అని చెప్పి బయలుదేరుతుండగా ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చి వసుని మాట్లాడాలి అని చెప్పి బయటకు తీసుకెళతాడు.
అప్పుడు గౌతమ్ మాట్లాడుతూ రిషి ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసావు అని అంటాడు. కానీ వసుధార మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు గౌతమ్ బొమ్మ గేసింది, లవ్ లెటర్ రాసింది కూడా రిషినే అని చెప్పడంతో వసుధార షాక్ అవుతుంది. కానీ గౌతమ్ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఏవేవో కారణాలు చెబుతుంది.
అప్పుడు గౌతమ్ నువ్వు అబద్ధం చెపుతున్నావు వసు నువ్వు రిషిని ప్రేమిస్తున్నావు కదా అని గట్టిగా అనడంతో అవును సార్ అని అంటుంది వసుధార. ఆ మాట విన్న రిషి షాక్ అవుతాడు. కానీ వసు మాత్రం నేను ప్రేమిస్తున్నది రిషి సార్ ని కాదు నా లక్ష్యాన్ని అని అంటుంది. ఆ మాటకు రిషి, ఇద్దరు స్టన్ అవుతారు. రేపటి ఎపిసోడ్ లో జగదీష్ ఏసీ తో మాట్లాడాలి అని వెళ్లగా అప్పుడు జగతి అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుతారు మేడం అని అంటాడు.
తనకు బాధపడడం అలవాటు అయిపోయింది. నేను రిజెక్ట్ అవ్వడానికి పుట్టాను నాకు ఈ వరం నాకు చిన్నప్పుడు నా తల్లి ఇచ్చింది అని అనడంతో జగతి ఏమోషనల్ అవుతుంది. ఆ తర్వాత వసుకి రిషి ఫోన్ చేయడంతో వసు ఆనంద పడతాడు.
Read Also : Guppedantha Manasu june 1 Today Episode : అసలు విషయాన్ని చెప్పేసిన వసు..రిషి గురించి బాధ పడుతున్న జగతి..?