Sridevi Drama Company : హీరోయిన్ పూర్ణతో అసభ్యంగా ప్రవర్తించిన ఇమ్మానియేల్.. సొమ్మసిల్లి పడిపోయిన రష్మి?

Sridevi Drama Company : ప్రతి ఆదివారం బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఈ వారానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ కనిపించలేదు. ఇక సుధీర్ స్థానంలో రష్మీ యాంకర్ గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Sridevi Drama Company
Sridevi Drama Company

ఇకపోతే ఈ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా హీరోయిన్ పూర్ణ ఎంట్రీ ఇచ్చారు. పూర్ణ ఎంట్రీ ఇవ్వగానే హైపర్ ఆది ఒక హగ్గు కావాలని అడగడంతో ఈ హగ్గులు ఇవ్వలేక ఢీ నుంచి బయటకు వచ్చా అంటూ సెటైర్ వేస్తుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్ వేసే మగ వాళ్ళను కూడా వేదికపైకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రస్తుతం వారికి లేడీ గెటప్స్ రావడం లేదని, ఇలా లేడీ గెటప్స్ వేయడంతో సమాజంలో కూడా చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ఎంతో సరదాగా సాగిపోయిన ఈ కార్యక్రమం చివర్లో ఒక ఈ పరిణామం చోటు చేసుకుంది. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ ఉండగా.. ఇమ్మానియేల్ హీరోయిన్ పూర్ణను తాకారు. దీంతో పూర్ణ ఒక్కసారిగా తన పై ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే ఇది వరకు ఇలాంటి సంఘటనలను పూర్ణ ఎంతో సరదాగా తీసుకున్నప్పటికీ ఈ కార్యక్రమంలో మాత్రం ఇమ్మానియేల్ పై ఒక్కసారిగా ఈమె ఫైర్ అయ్యారు.ఇలా వీరిద్దరూ గొడవ పడుతున్న సమయంలో అక్కడే నిలబడి ఉన్నటువంటి రష్మీ ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడి పోతుండగా ఆటో రాంప్రసాద్ తనని కింద పడకుండా పట్టుకుంటారు. అయితే నిజంగానే ఈ కార్యక్రమంలో ఏం జరిగిందనే విషయం గురించి ఆత్రుత ఏర్పడింది.నిజంగానే వీరు గొడవ పడ్డారా లేదంటే ఎప్పటిలాగే ప్రోమో కోసం ఇలా హైలెట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : Anchor manjusha : టైట్ డ్రెస్సులో అందాలన్నీ చూపిస్తున్న యాంకర్ మంజూష.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel