Anchor suma: సుమ న్యూయార్క్ వెళ్లేందుకు కారణం ఇదా.. అంతా ఇంకేదో అనుకున్నారే!

Anchor suma new yakr trip reason
Anchor suma new yakr trip reason

Anchor suma : యాంకర్ సుమ గత కొన్ని రోజుల నుంచి న్యూ యార్క్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యాంకర్ రవి కూడా అక్కడే ఉన్నట్లు కనిపిస్తోంది. వీరంతా వెకేషన్ లో భాగంగా న్యూ యార్క్ చ్రిప్ కు వెళ్లి ఉంటారని అందరూ భావించారు. కానీ అసలు మ్యాటర్ అది కాదని తెలుస్తోంది. అమెరికాలో ఉండే తెలుగు సంఘాల గురించి అందరికీ తెలిసిందే. నాటా, ఆట, పాట, తానా అంటూ ఇలా లెక్కలేనన్ని తెలుగు సంఘాలు ఉంటాయి అక్కడ. ఇక వీరంతా మన సెలబ్రిటీలను అక్కడకు ఆఆహ్వానించి సన్మానిస్తుంటారు. అన్ని ఖర్చులు కూడా వారే భరిస్తుంటారు.

Anchor suma
Anchor suma

అయితే వారు తాజాగా యాంకర్ సుమను, రవిని అక్కడకు పిలివడంతోనే వెళ్లినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా సుమ అక్కడ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అక్కడి వీధుల్లో, రెస్టారెంట్లలో తిరుగుతూ నానా హంగామా చేస్తోంది. ఇక వినోద రంగానికి తాను చేసిన సేవలకు గుర్తు గాను ఆమెకు ఈ సన్మానం చేశారట. ఇందుకు సుమ వారందరికీ థాంక్స్ కూడా చెప్పింది.

Advertisement

Read Also : Anchor Suma : విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సుమ.. రెస్టారెంట్ లో రోబో సర్వర్ తో ఆటలు..!

Advertisement