Srimukhi: స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో రచ్చ చేస్తున్న శ్రీముఖి.. ఫోటోలు వైరల్!

Updated on: May 30, 2022

Srimukhi: బుల్లితెర రాములమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఈమె వరస బుల్లితెర కార్యక్రమాలతో ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీముఖి జాతి రత్నాలు, సరిగమప సింగిల్ షో లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా మరో వైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రస్తుతం కెరీర్ పరంగా శ్రీముఖి ఎంతో బిజీ అయ్యారు.

ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న శ్రీముఖి వీకెండ్ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తన డిజైనర్ కీర్తన సునీల్, ఇతర స్నేహితులతో కలిసి శ్రీముఖి వీకెండ్ పార్టీలో తెగ ఎంజాయ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో శ్రీముఖి పొట్టి నిక్కరు ధరించి అందాలను ఆరబోస్తూ రచ్చ చేశారు. రాత్రి ఫ్రెండ్స్ తో కలిసి కారులో రైడ్‌కెళ్లింది. కారులు పాటలకు వాళ్లు చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పాలి.

ఇలా స్నేహితులతో కలిసి ఫుల్లుగా పార్టీ చేసుకున్న శ్రీముఖికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను శ్రీముఖి డిజైనర్ కీర్తన సునీల్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి శ్రీముఖి స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీలో ఏ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగా ఎంజాయ్ చేశారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel