October 5, 2024

Pulipirlu: ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ మొక్కతో పులిపిర్లు సమస్యకు చెక్ పెట్టవచ్చు..!

1 min read
860e50a3 726d 4f6e 9813 e5b4abf63a56

Pulipirlu: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల మొక్కల ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. అలాగే పులిపిర్లు సమస్యతో బాధపడేవారు కూడా ఈ రోజుల్లో వాటిని నిర్మూలించడానికి వేల రూపాయలు ఖర్చు చేసి మందులు వాడటం శస్త్ర చికిత్స చేయించుకోవడం వంటివి చేస్తున్నారు. కానీ ప్రకృతిలో లభించే ఒక చిన్న మొక్క వల్ల ఈ పులిపిర్లు సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చు. పంట పొలాల్లో విరివిగా లభించే రెడ్డి వారి నానుబాలు మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క పులిపిర్లు సమస్యను తగ్గించడం లో చాలా బాగా ఉపయోగపడుతుంది. పులిపిర్లు సమస్యను నిర్మూలించడానికి ఈ మొక్కని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

860e50a3 726d 4f6e 9813 e5b4abf63a56పంట పొలాల్లో ఎక్కువగా పెరిగే ఈ మొక్క నేల మీద మాత్రమే పాకుతూ పెరుగుతుంది. ఈ మొక్క చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మొక్క ఆకులు, కాండం తెంచినప్పుడు దాని నుండి పాలు కరుతాయి. పులిపిర్లు సమస్యతో బాధపడేవారు ఈ మొక్క కాండం నుండి వచ్చే పాలను ప్రతిరోజు పులిపిరి మీద రాయాలి. ప్రతి రోజు ఇలా చేయటం వల్ల కొంత కాలం తరువాత పులిపిర్లు వాటంతటవే రాలిపోతాయి. ఈ మొక్క వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మొక్క పులిపిర్లు సమస్యను నియంత్రించడమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుంది.

గాయం తగిలి రక్తస్రావం జరుగుతున్న ప్రదేశంలో ఈ మొక్క నుండి వచ్చే పాలు రాయటం వల్ల రక్తస్రావం ఆగిపోతుంది. అంతే కాకుండ గాయం అయిన ప్రదేశంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కాకుండా నివారించి గాయం తొందరగా మానిపోయేలా చేస్తాయి. అలాగే కంటిచూపు సమస్యలతో బాధపడే వారు కూడా ఈ మొక్క పాలు రెండు చుక్కలు కంట్లో వేసుకోవటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ మొక్క ఆకులు మెత్తగా రుబ్బి చూర్ణంచేసి తినటం వల్ల మహిళల్లో వచ్చే గర్భాశయ సంబంధిత వ్యాధులు కూడా నిర్మూలించవచ్చు.